Current Affairs Telugu Daily

‘గగన్‌యాన్‌’ కోసం రష్యా సహకారం
*  అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్‌-రష్యా పరస్పర సహకారం అందించుకొనే దిశగా ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ తెలిపారు.
*  రష్యా వద్ద ఉన్న సెమీ క్రయోజనిక్‌ ఇంజిన్‌ సాంకేతికతను భారత్‌ చేపట్టబోయే మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్‌’ కోసం వినియోగించే అంశంపై చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించారు.
*  అంతేకాక ఈ ప్రయోగం కోసం ఆ దేశం నుంచి కొన్ని విడి భాగాలను దిగుమతి చేసుకొనే అంశం పరిశీలనలో ఉందని చెప్పారు.
* ‘‘కొన్ని అంశాల్లో సహకారం కోసం రష్యా అంతరిక్ష సంస్థతో చర్చలు జరుపుతున్నాం. కానీ ఇంతవరకూ చర్చలేవీ ఖరారు కాలేదు. 
* భారత్‌ చేపట్టబోయే గగన్‌యాన్‌ ప్రాజెక్టు కోసం మన వ్యోమగాములకు రష్యా శిక్షణ ఇచ్చే అంశంపై మాత్రం చర్చలు కొలిక్కి వచ్చాయి.
*  అంతేకాక రష్యా భారత్‌కు సెమీ క్రయోజెనిక్‌ ఇంజిన్‌ సాంకేతికతను అందించనుంది. మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ పరిజ్ఞానంతో రాకెట్‌ ఇంజిన్లు భారత్‌లోనే తయారవుతాయి. 
*  కచ్చితమైన ఉపగ్రహ నావిగేషన్‌ సిగ్నళ్ల కోసం రెండు దేశాలు తమ ప్రాంతాల్లో గ్రౌండ్‌ స్టేషన్లు నెలకొల్పే అంశంపైనా చర్చలు జరుగుతున్నాయి. 
* నావిగేషన్‌ కోసం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అందుబాటులోకి రానున్న ‘నావిక్‌’ వ్యవస్థ కోసం రష్యాలో గ్రౌండ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం.
*  వారి శాటిలైట్‌ నావిగేషన్‌ వ్యవస్థ కోసం భారత్‌లో గ్రౌండ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలనుకుంటోంది. 
* ఇది బెంగళూరులో ఉండనుండగా, మన గ్రౌండ్‌ స్టేషన్‌ మాస్కోలో ఏర్పాటయ్యే అవకాశం ఉంది.’’ 
* వ్యోమ నౌకలను నడిపే పైలట్లు, ఉపగ్రహ నావిగేషన్‌, ఇంజిన్‌ సాంకేతికత తదితర అంశాల్లో సహకారం కోసం ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నట్లు రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రొస్‌కోస్‌మాస్‌  తెలిపింది. 

views: 687

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams