Current Affairs Telugu Daily

మాజీ ప్రధాని మన్మోహన్‌కు భద్రత కుదింపు
*  మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌కు ప్రత్యేక భద్రతా బృందం(ఎస్పీజీ) భద్రతను కేంద్రం వెనక్కి  మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌కు ప్రత్యేక భద్రతా బృందం(ఎస్పీజీ) భద్రతను కేంద్రం వెనక్కి తీసుకుంది. 
* Z+ భద్రతను ఆయనకు కొనసాగించనున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది.
*  ఎస్పీజీ భద్రతపై సమీక్ష చేపట్టిన అనంతరం కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తెలిపింది..
*  ప్రస్తుతం ఎస్పీజీ హోదా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, కాంగ్రెస్ జాతీయాధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ తదితరులకు కొనసాగుతోంది. 
* ‘భద్రతా ముప్పు ఆధారంగా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ఎస్పీజీ సెక్యూరిటీ తగ్గించాం. సెక్యూరిటీ ఏజెన్సీలు నివేదికల సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాం. మన్మోహన్‌కు Z+ సెక్యూరిటీ కొనసాగుతుంది’ అని హోం మంత్రిత్వ శాఖ  వెల్లడించింది.
* 2014 వరకు మన్మోహన్‌  సతీమణి గురశరణ్‌ సింగ్‌, కుమార్తెలకు ఎస్పీజీ హోదా ఉండేది. 
* తమకు ఎలాంటి భద్రతా అవసరం లేదని మన్మోహన్‌ కుమార్తెలు స్వచ్ఛందంగా వెనక్కి ఇచ్చేశారు. 
* వ్యక్తిగత భద్రత గురించి మన్మోహన్‌కు ఎలాంటి ఆందోళనా లేదని ఆయన సన్నిహితులు తెలిపారు. 
* అయితే ఇలా మాజీ ప్రధానుల ఎస్పీజీ సెక్యూరిటీని వెనక్కి తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. 
* గతంలో అప్పటి ప్రధానులు హెచ్‌డీ దేవెగౌడ, వీపీ సింగ్‌ల విషయంలోనూ ఇలాగే జరిగింది. కానీ, మరో మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయీకి మాత్రం ఆయన మరణించే వరకూ ఎస్పీజీ భద్రత కొనసాగింది.  ఆయన దత్త పుత్రికకూ కూడా సెక్యూరిటీ కొనసాగించారు. 
* మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత ఈ ఎస్పీజీని తీసుకొచ్చారు. 1985లో దీన్ని అమల్లోకి తెచ్చారు.
* 15వ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ భారత దేశానికి 17వ ప్రధాన మంత్రి.
*  భారత జాతీయ కాంగ్రెస్‌ సభ్యుడైన సింగ్ ప్రధాన మంత్రిగా 2004 మే 22 లో బాధ్యతలు స్వీకరించారు.

views: 609

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams