Current Affairs Telugu Daily

గంగా నది పరిసరాల్లో చెత్తవేస్తే రూ.50 వేలు జరిమానా
గంగా నది ప్రక్షాళన అంశంపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌  2017 జులై 13న కీక ఆదేశాలు జారీ చేసింది. గ్రీన్‌ గంగా ప్రాజెక్టులో గంగా నది అంచు నుంచి 500 మీటర్ల పరిధిలో ఎలాంటి చెత్తను డంప్‌ చేయడానికి వీల్లేదని ఆదేశించింది. అలాంటి వారికి భారీ జరిమానా విధించాల్సిందిగా  గ్రీన్‌ ట్రిబ్యునల్‌ చీఫ్‌ జస్టిస్‌ స్వతంతర్‌ కుమార్‌ ఆదేశించారు. లెదర్‌ పరిశ్రమలను కూడా గంగా నదికి దూరంగా తరలించాలని కూడా స్పష్టం చేసింది. హరిద్వార్‌-ఉన్నావ్‌కు మధ్య  విస్తరించిన 100 మీటర్ల పరిధిలోని  భూభాగాన్ని  నో-డెవలప్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించింది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై రూ.50 వేల జరిమానా విధించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించింది.   
views: 1068



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams