Current Affairs Telugu Daily

ఏపీ ప్రభుత్వ సలహాదారుగా సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్
* సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియమించారు. 
* ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసారు. జాతీయ మీడియా వ్యవహారాలు , అంతర్రాష్ట్ర వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతను కూడా అమర్ కు అప్పగించారు.
అమర్ దేవులపల్లి మదన్ మోహనరావు మరియు సరస్వతి దంపతులకు జన్మించారు. వీరు బి.ఏ. పూర్తిచేసిన తర్వాత జర్నలిజంలో పట్టా పొందారు.
* దేవులపల్లి అమర్ 1975లో ప్రజాతంత్ర పత్రికకు కరస్పాండెంట్ గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 
*  ఆంధ్రప్రభ స్టాఫ్ రిపోర్టర్ గా కొంత కాలం పాటు పనిచేసి సంపాదకునిగాఎదిగారు.
* వీరు ఈనాడు, ఉదయం, ఆంధ్ర భూమి  పత్రికలలో పనిచేశారు . 
* ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్పదవి కూడా అమర్ పనిచేశారు.
* ప్రస్తుతం అమర్ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడుగా వున్నారు. ఐజెయు లో కీలక పాత్ర పోషిస్తున్నారు

views: 793

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams