Current Affairs Telugu Daily

నీటివనరుల పునరుద్ధరణలో తెలంగాణ దేశంలో తొలిస్థానం
* తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్‌ కాకతీయ పథకం అద్భుతంగా ఉందని నీతి ఆయోగ్‌ ప్రశంసించింది.
*  ఈ పథకం ద్వారా రాష్ట్రంలో జలవనరుల పునరుద్ధరణ గొప్పగా జరిగిందని ఈ విషయంలో దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచిందని  విడుదల చేసిన ‘సమగ్ర నీటి యాజమాన్య సూచిక’ నివేదికలో వెల్లడించింది. 
* దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు జలవనరుల నిర్వహణ, తాగు, సాగునీరు అందించడంలో చూపుతున్న ప్రతిభను ఆధారంగా చేసుకొని నీతి ఆయోగ్‌ మూడేళ్లుగా నివేదికలు విడుదల చేస్తోంది.
*  2019 సంవత్సరానికి చెందిన నివేదికను కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్‌, సీఈఓ అమితాబ్‌కాంత్‌లు విడుదల చేశారు.
* ఇందులో తెలంగాణలో జరిగిన మిషన్‌ కాకతీయ కార్యక్రమాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. 
* దానివల్ల చెరువుల కింద 51.5% మేర సాగు పెరిగినట్లు పేర్కొన్నారు.
* నీటివనరుల పునరుద్ధరణలో తెలంగాణ దేశంలో తొలిస్థానంలో నిలిచింది.
* మూడేళ్లలో సాగునీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచుకున్న తొలి రెండు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి.
* 2015-16లో తొలి నివేదిక విడుదల చేసే సమయానికి తెలంగాణ కనిష్ఠ పనితీరు కనబరిచిన రాష్ట్రాల జాబితాలో ఉన్నప్పటికీ ఈ మూడేళ్లలో అది 50 పాయింట్లను దాటింది.
* జలవనరుల కింద సాగునీటి యోగ్యతను 100 శాతం పునరుద్ధరించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. 60 శాతం గ్రామీణ ప్రాంతాలకే తాగునీరు అందుతున్నప్పటికీ నీటినాణ్యత సమస్యలను 100 శాతం పరిష్కరించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎదురవుతున్న నీటి నాణ్యత సమస్యలను తగ్గించడంలో తెలంగాణ దేశంలో రెండోస్థానంలో నిలిచింది.
* ప్రస్తుతం పట్టణప్రాంతాల్లో 80% ఇళ్లకు తాగునీరు అందుబాటులోకి వచ్చింది. అందులో 75% మంది నుంచి రుసుములు కూడా వసూలు చేస్తున్నారు.
* మధ్యతరహా సాగునీటి వనరులను అంచనా వేయడానికి ప్రభుత్వం నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ ద్వారా అధ్యయనం చేయించి ఆ వివరాలను భువన్‌ వెబ్‌పోర్టల్‌ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచింది.
* సమగ్ర నీటి వినియోగంలో 50 పాయింట్లతో దేశంలో పదో స్థానంలో నిలిచింది.
* భూగర్భ జలాలు విపరీతంగా వాడిన ప్రాంతాలు, ప్రమాదకర స్థాయిలో ఉన్న ప్రాంతాలను గుర్తించి రీఛార్జింగ్‌కు వీలుగా మ్యాపింగ్‌ చేసే విషయంలో తెలంగాణ పనితీరు బాగాలేదు. ఈ విషయంలో చివరిస్థాయిలో నిలిచింది. గతేడాదితో పోల్చితే 65% పాయింట్లను కోల్పోయింది. కేవలం 12% భూగర్భజల రీఛార్జి ప్రాంతాలనే మ్యాపింగ్‌ చేసింది. అందులోనూ 5% ప్రాంతంలో మాత్రమే రీఛార్జికి అవసరమైన మౌలిక వసతులను కల్పించింది.
* రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్తు ఫీడర్లను వేరు చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టలేదు. బోర్‌వెల్స్‌కి అందించే విద్యుత్తుకు రుసుము వసూలు చేయని కొన్ని రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. సూక్ష్మసేద్య వ్యవస్థ గుర్తించదగిన స్థాయిలో వినియోగంలోకి రాలేదు.
* జలవనరుల నిర్వహణ, యాజమాన్య విభాగాల్లో నీటి వినియోగ సంఘాల భాగస్వామ్యం పెంపొందించడంలో మాత్రం చివరి స్థానంలో ఉంది.

views: 734

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams