Current Affairs Telugu Daily

తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జిలు
*  తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. 
*  న్యాయవాదులు తడకమళ్ల వినోద్‌కుమార్‌, అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డి, కూనూరు లక్ష్మణ్‌లను న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది.
*  కొలీజియం సిఫార్సు చేసిన వీరి పేర్లను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదిస్తూ  ఉత్తర్వులు జారీ చేశారు. 
*  ఈ నెల 26న వీరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తాజా నియామకాలతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 14కు పెరిగింది. 
* మొత్తం 24 పోస్టులు మంజూరు కాగా ఇంకా 10 ఖాళీలున్నాయి.
* తడకమళ్ల వినోద్‌కుమార్‌
* స్వగ్రామం: నల్గొండ జిల్లా దాచారం 
* తల్లిదండ్రులు: పి.లక్ష్మీనరసింహారావు, శకుంతల 
* జన్మదినం: 1964 నవంబరు 17 
* చదువు: హైదరాబాద్‌ ఎంబీ హైస్కూల్‌లో పదో తరగతి, ఆలియా ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌, వీవీ కాలేజీలో బీఏ, ఉస్మానియాలో న్యాయశాస్త్రం చదివారు. 
* వృత్తి జీవితం: 1988లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. సీనియర్‌ న్యాయవాది ఎస్‌.రవి వద్ద జూనియర్‌గా చేరారు.
*  1993 నుంచి సొంత ప్రాక్టీస్‌ ప్రారంభించారు. 2015 నుంచి ఆదాయపు పన్ను శాఖ సీనియర్‌ స్టాండింగ్‌ కౌన్సెల్‌గా, 2016 నుంచి వాణిజ్య పన్నుల శాఖ సీనియర్‌ స్టాండింగ్‌ కౌన్సెల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 
* అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డి
* స్వగ్రామం: రంగారెడ్డి జిల్లా 
* తల్లిదండ్రులు: పుల్లారెడ్డి, శశిరేఖారెడ్డి 
* జన్మదినం: 1967 నవంబరు 7 
* చదువు: హైదరాబాద్‌లోని హైదర్‌గూడ సెయింట్‌ ఫాల్స్‌ పాఠశాలలో 10వ తరగతి, లిటిల్‌ ఫ్లవర్‌ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌, నిజాం కాలేజీలో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 
* వృత్తి జీవితం: 1990లో బార్‌ కౌన్సిల్‌లో ఎన్‌రోల్‌ అయ్యారు. ప్రముఖ న్యాయవాది అయిన తండ్రి ఎ.పుల్లారెడ్డి వద్దే జూనియర్‌గా ప్రాక్టీస్‌ ప్రారంభించారు.
*  సివిల్‌, రాజ్యాంగ కేసుల్లో పట్టున్న ఆయన 2004-07 మధ్య భూ ఆక్రమణల నిరోధక కోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 
* 2007-09 మధ్య హైకోర్టులో ఉన్నత, సాంకేతిక విద్యాశాఖల తరఫున ప్రభుత్వ న్యాయవాదిగా, హైదరాబాద్‌ జేఎన్‌టీయూ, టీఎఫ్‌ఆర్‌సీ, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, ఛత్తీస్‌గఢ్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌, పుదుచ్చేరి పట్టణాభివృద్ధి మండలి తరఫు న్యాయవాదిగా విధులు నిర్వహించారు. పలు ప్రభుత్వ రంగ సంస్థలకు న్యాయవాదిగా సేవలందించారు. 
* కూనూరు లక్ష్మణ్‌
* స్వగ్రామం: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం భోగారం
* తల్లిదండ్రులు: గోపాల్‌, సత్తెమ్మ 
* జన్మదినం: 1966 జూన్‌ 8 
* చదువు: చిన్నపాటి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన లక్ష్మణ్‌ ఇంటర్‌ వరకు రామన్నపేటలో చదివారు. హైదరాబాద్‌ అమీర్‌పేట న్యూసైన్స్‌ కాలేజీలో బీఎస్సీ డిగ్రీ, ఎస్వీ యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 
* వృత్తి జీవితం: 1993లో ఎన్‌రోల్‌ అయ్యాక సీనియర్‌ న్యాయవాది మాదిరాజు రాధాకృష్ణమూర్తి వద్ద జూనియర్‌గా చేరారు. 1999 నుంచి సొంత ప్రాక్టీస్‌ ప్రారంభించారు. యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సహా 60-70 సంస్థలకు న్యాయవాదిగా సేవలందించారు.
*  సివిల్‌, రాజ్యాంగ, కార్మిక, రెవెన్యూ, సహకార, మనీలాండరింగ్‌ నిరోధక చట్టాల్లో ప్రావీణ్యం ఉంది.
* 2017 ఆగస్టు 24 నుంచి ఇప్పటివరకు కేంద్రం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌గా సేవలందించారు.

views: 690

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams