Current Affairs Telugu Daily

వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయం’ పథకం
* వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయం’ అనే పథకంలో భాగంగా రైతులకు ఇస్తున్న రాయితీలను పెంచాలని వ్యవసాయశాఖ  నిర్ణయించింది. 
* ఇందుకయ్యే నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. 
* ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయశాఖ ఇచ్చిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది.
*  ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని అమలుచేస్తున్నారు. 
* నాబార్డు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇక్రిశాట్‌, ఈపీటీఆర్‌ఐల భాగస్వామ్యంతో ఈ పథకం అమలవుతోంది.
*  వాతావరణ మార్పులను తట్టుకునేలా శాస్త్రీయ పద్ధతుల్లో పంటల సాగు విధానాలను పాటించి అధిక దిగుబడులు పొందాలనేది ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. 
*  రైతుల పొలాల్లో నీటి గుంతల తవ్వకం, బిందు సేద్యం, అధిక దిగుబడినిచ్చే కొత్త వంగడాల సరఫరా, అంతర పంటల సాగువంటి విధానాలను వ్యవసాయ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో చేపడతారు. 
* రైతు కుటుంబాల జీవనోపాధి కోసం పాడి పశువులు, వాన పాముల ఎరువు తయారీ కేంద్రాలు వంటివి ఏర్పాటు చేస్తారు.
* జడ్చర్ల, బిజినేపల్లి, ఘన్‌పూర్‌ క్లస్టర్లలో అయిదేసి గ్రామాలను ఎంపిక చేసి ఈ పథకాన్ని 4 ఏళ్ల పాటు అమలుచేయాలని 2016లో తొలుత నిర్ణయించారు. 
*  అప్పటి నుంచి పనులు ముందుకు సాగలేదు. తొలుత ప్రతి రైతుకు ఇచ్చే సొమ్ములో 50 శాతం రాయితీగా భరించాలని కేంద్రం ఆదేశించింది.
*  దీనివల్ల ఒక్కో రైతు గరిష్ఠంగా రూ.62,500 వరకు తన వాటా కింద చెల్లించాలి. 
* ఇంత సొమ్ము పేద రైతులు కట్టలేరని, పథకం అమలు కావడం కష్టం అని రాష్ట్ర వ్యవసాయశాఖ తాజాగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. 
* కేంద్రం ఇచ్చే 50 శాతం రాయితీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో 25 శాతం రాయితీ ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. 
* దీనివల్ల ఒక్కో రైతుకు గరిష్ఠంగా అందే రాయితీ రూ.93,750కి చేరింది. రైతు తనవాటాగా రూ.28,750 చెల్లిస్తే సరిపోతుంది.
*  ఇప్పటికే మహబూబ్‌నగర్‌, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో 765 మంది రైతులు దరఖాస్తు చేశారు. 
* ఈ పథకాకం అమలును 2021 మార్చికల్లా పూర్తిచేస్తారు .

views: 768



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams