Current Affairs Telugu Daily

పోషణ్‌ అభియాన్‌ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానం
* పోషణ్‌ అభియాన్‌ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలిచింది. 
* రాష్ట్రంలోని 55 వేలకుపైగా అంగన్‌వాడీ కేంద్రాలకు మొబైల్‌ ఫోన్లు అందించడం డాటా వినియోగంలో సమర్థంగా పని చేస్తున్నందుకు ఐసీడీఎస్‌-సీఏఎస్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ స్థానం దక్కించుకుంది.
*  తెలంగాణతో పాటు తొమ్మిది రాష్ట్రాలున్న గ్రూప్‌-2 విభాగంలో తొలిస్థానంలో నిలిచింది. 
* కార్యకర్తల సామర్థ్యం పెంపు, విభిన్న ప్రభుత్వ కార్యక్రమాల అమలు, సమన్వయంతో పథకాల అమలు, ప్రవర్తనా మార్పులు, సామాజిక సమీకరణ అంశాల్లో రాష్ట్రానికి ద్వితీయ అవార్డు దక్కింది.
*  పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ఉద్దేశించిన పోషణ్‌ అభియాన్‌లో ఉత్తమ పనితీరు కనబర్చిన రాష్ట్రాలు, జిల్లా, ప్రాజెక్టు, క్షేత్ర స్థాయి సిబ్బందికి కేంద్ర శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ అవార్డులను అందజేశారు.
*  రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కె.దమయంతి, కమిషనర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా ప్రథమ అవార్డుతో పాటు రూ.కోటి చెక్కును, ద్వితీయ అవార్డుతో పాటు రూ.75 లక్షల చెక్కును అందుకున్నారు.
*  జిల్లాస్థాయి నాయకత్వ సమన్వయ అవార్డును కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌, ఐసీడీఎస్‌ పీడీ కె.కృష్ణకుమారి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఐ.రమేష్‌, ఎక్స్‌టెన్షన్‌ అధికారి ఎన్‌.సునీతాదేవి అందుకున్నారు. 
* ప్రాజెక్ట్‌ స్థాయి నాయకత్వ అవార్డును అనంతపురం జిల్లా శింగనమల సీడీపీవో జి.వనజ అక్కమ్మ, క్షేత్రస్థాయి నాయకత్వ అవార్డులను చిత్తూరు జిల్లా పుత్తూరు బ్లాక్‌ పరిధిలోని ఎల్‌.జయంతి(అంగన్‌వాడీ కార్యకర్త), బి.భారతి(ఆశా), టి.గిరిజ(ఏఎన్‌ఎం), ఎం.ద్రాక్షాయణి(అంగన్‌వాడీ సహాయకురాలు), ఎస్‌.తులశమ్మ(మహిళా పర్యవేక్షకురాలు), గుంటూరు జిల్లా తెనాలి బ్లాక్‌ పరిధిలో ముళ్లపుడి సునీత (అంగన్‌వాడీ కార్యకర్త), శాంతకుమారి (ఆశా), ముత్యాల వెంకాయమ్మ(ఏఎన్‌ఎం), ఏపూరి రాజేశ్వరి(అంగన్‌వాడీ సహాయకురాలు), జి.వెంకటరమణ(మహిళా పర్యవేక్షకురాలు) స్వీకరించారు

views: 773

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams