Current Affairs Telugu Daily

పాలీపిల్‌తో తగ్గనున్న గుండె జబ్బు ముప్పు
*రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఔషధాలు, ఆస్పిరిన్‌లతో కూడిన ఓ చవకైన మాత్ర..పాలీపిల్‌ను రోజూ తీసుకోవడం ద్వారా గుండె వైఫల్యం, పక్షవాతం ముప్పును మూడొంతులు తగ్గించవచ్చని తాజా పరిశోధనలో వెల్లడైంది.
*గుండె, రక్తనాళాల వ్యాధుల చరిత్ర లేని వారిలో పాలీపిల్‌ మంచి ప్రభావం చూపుతున్నట్లు క్లినికల్‌ ట్రయల్స్‌లో తేలింది.
*ప్రస్తుతం రక్తపోటు తగ్గించేందుకు ఒకట్రెండు రకాల మాత్రలు ఇస్తూ, కొవ్వు ఆమ్లాలను నిలువరించేందుకు స్టాటిన్‌ మాత్రలు ఇస్తున్నారు. వీటికి తోడు రక్తాన్ని పలుచగా ఉంచేందుకు ఆస్పిరిన్‌నూ ఇస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల్లో 30-40 ఏళ్లపాటు రోజూ బహుళ రకాల మాత్రలు వేసుకోవడం ఒక సవాలేనని లండన్‌ ఇంపీరియల్‌ కాలేజ్‌ పరిశోధకులు కౌశిక్‌ రే పేర్కొన్నారు. ఈ సమస్యను పాలీపిల్‌ అధిగమిస్తుందన్నారు.
**ఇంపీరియల్ కాలేజ్  లండన్లో ఉన్న ఒక ప్రజా పరిశోధనా విశ్వవిద్యాలయం, యునైటెడ్ కింగ్డమ్. దీని వ్యవస్థాపకుడు, ప్రిన్స్ ఆల్బర్ట్, విక్టోరియా మరియు ఆల్బర్ట్ మ్యూజియం, నేచురల్ హిస్టరీ మ్యూజియం, రాయల్ ఆల్బర్ట్ హాల్ మరియు ఇంపీరియల్ ఇన్స్టిట్యూట్లతో కూడిన ప్రాంతంలో కనిపించింది.ఇంపీరియల్ కాలేజ్ లండన్, రాజధాని కేంద్రంగా  ఉన్న ఒక విజ్ఞాన-ఆధారిత సంస్థ, UK యొక్క ప్రముఖ సంస్థలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

views: 687

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams