Current Affairs Telugu Daily

 సమగ్ర నీటి యాజమాన్య సూచికలో ఆంధ్రప్రదేశ్‌ 2వ స్థానం
*  నీతిఆయోగ్‌ విడుదల చేసిన సమగ్ర నీటి యాజమాన్య సూచికలో ఆంధ్రప్రదేశ్‌ 74 మార్కులతో దేశంలో రెండో స్థానంలో నిలిచింది.
* 75 పాయింట్లతో గుజరాత్‌ మొదటి స్థానంలో, 71 పాయింట్లతో మధ్యప్రదేశ్‌ ముడోస్థానంలో నిలిచాయి.
*  జలవనరుల సంరక్షణ, సాగు, తాగునీటి సరఫరా విషయంలో తీసుకుంటున్న చర్యల ఆధారంగా రాష్ట్రాల పనితీరును అంచనా వేసి నీతిఆయోగ్‌ మూడేళ్లుగా నివేదికలు ఇస్తోంది. 
* 2018-19 నివేదికను  కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, నీతిఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్‌, సీఈవో అమితాబ్‌కాంత్‌లు విడుదల చేశారు.
* భూగర్భజలాల రీఛార్జి ప్రాంతాల మ్యాపింగ్‌ను 100% పూర్తిచేయడంతోపాటు, రాష్ట్రంలోని 15 లక్షల బోరుబావుల్ని పూర్తిగా జియోట్యాగ్‌ చేసి అందులోని భూగర్భజలాల స్థాయిని ఆన్‌లైన్‌ ద్వారా ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నట్లు పేర్కొంది. 
* సాగునీటి సామర్థ్య కల్పన, వినియోగంలో ఆంధ్రప్రదేశ్‌ 100% స్కోర్‌ సాధించింది.
* నీరు- చెట్టు కార్యక్రమం కింద 7 వేల పంటకుంటలు, 22 వేల చెక్‌డ్యాంలు మరమ్మతు చేయడంతోపాటు, కొత్తగా 102 ఎత్తిపోతల పథకాలను వినియోగంలోకి తెచ్చి 2.10 లక్షల ఎకరాలకు సాగునీటి యోగ్యం కల్పించారు.
* భారీ, మధ్యతరహా సాగునీటి సరఫరాలోనూ ఆంధ్రప్రదేశ్‌ 80కి పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
* అనంతపురం జిల్లాలో 51,825 వాననీటి సంరక్షణ నిర్మాణాలు చేపట్టడంతో 15,783 హెక్టార్లకు అదనంగా సాగునీటి సౌకర్యం లభించింది. 
* 40 వేల మంది రైతులకు శిక్షణ ఇవ్వడం వల్ల ఈ జిల్లాలో 39,801 హెక్టార్లలో సూక్ష్మసేద్యం పెరిగింది.
* కడప జిల్లాలోని పాపాగ్ని నదిపై తక్కువ ఖర్చుతో ఆరుచోట్ల సబ్‌ సర్ఫేస్‌ డ్యామ్‌లు నిర్మించింది. 
* ఈ ప్రాజెక్టుకు 2018 నేషనల్‌ వాటర్‌ అవార్డు దక్కింది.
* ఆంధ్రప్రదేశ్‌లో అన్ని గ్రామాలకూ పైపుల  ద్వారా నీరందుతోంది.

views: 766

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams