Current Affairs Telugu Daily

అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం
* అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.
* ఇప్పటికే తీవ్రరూపం దాల్చినప్పటికీ కట్టడి చేసేందుకు ఇరు దేశాలు ఏమాత్రం చొరవ తీసుకుంటున్నట్లు కనిపించడం లేదు.
* అగ్రరాజ్యానికి చెందిన 75 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై సుంకాలు విధిస్తామని  చైనా ప్రకటించడం ఇందుకు కారణం.
* వ్యవసాయం, ఇంధనం, చిన్న తరహా విమానాలు, కార్లు ఇలా మొత్తం 5,078 వివిధ రకాల అమెరికా దిగుమతి ఉత్పత్తులపై ఐదు నుంచి పదిశాతం అదనపు సంకాలు వేసేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా ఆర్థిక మంత్రిత్వశాఖ మంత్రి  అమల్లోకి వస్తాయని వివరించింది.
* సెప్టెంబర్‌ 1 నుంచి కొన్ని ఉత్పత్తులపై డిసెంబర్‌ 15 నుంచి మరికొన్ని ఉత్పత్తులపై పెరిగిన సుంకాల శాతం అమల్లోకి వస్తాయని వివరించింది.
* గతంలో 300 బిలియన్‌ డాలర్లు విలువ చేసే చైనా దిగుమతులపై సెప్టెంబర్‌ 1 నుంచి సుంకాలు పెంచాలనుకుంది ట్రంప్‌ సర్కార్‌.
* అందులో కొన్ని ఉత్పత్తులను డిసెంబర్‌ 15కు వాయిదా వేసింది. 
* ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో ఉన్నందున చర్చల ద్వారా ద్వైపాక్షికంగా సమస్యను పరిష్కరించుకుందామని చైనా ప్రభుత్వం ఇటీవల ట్రంప్‌ను కోరినప్పటికీ ఫలితం లేకపోవడం గమనార్హం.

views: 600

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams