Current Affairs Telugu Daily

ఫోర్బ్స్‌ సంపన్న నటుల జాబిత : నాలుగో స్థానం అక్షయ్‌ కుమార్‌
* ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం అందుకున్న పది మంది నటులతో ఫోర్బ్స్‌ సంస్థ ఓ జాబితా విడుదల చేసింది.
*  జూన్‌ 1, 2018 - జూన్‌ 1, 2019 మధ్య కాలానికి రూపొందించిన ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు అక్షయ్‌ కుమార్‌.
*  ఆ ఏడాదిలో ఆయన ఆదాయం 65 మిలియన్‌ డాలర్లని (సుమారు రూ.466 కోట్లు) ఫోర్బ్స్‌ వెల్లడించింది.
*  ఆ సమయంలో ‘గోల్డ్‌’, ‘2.ఓ’, ‘కేసరి’ చిత్రాల్లో నటించారు అక్షయ్‌. 
* వాటితో పాటు వాణిజ్య ప్రకటనల్లోనూ కనిపించారు. వాటి ద్వారా భారీ ఆదాయం అందుకున్నారాయన. 
* ‘‘అక్షయ్‌ కుమార్‌ ఒక్కో చిత్రానికి 5 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.35.5 కోట్లు) నుంచి 10 మిలియన్‌ డాలర్ల వరకూ (సుమారు రూ.71 కోట్లు) పారితోషికం తీసుకుంటారు.
*  దీంతో పాటు 20కి పైగా వాణిజ్య ప్రకటనల్లో కనిపిస్తూ కోట్లాది రూపాయలు అందుకుంటున్నార’’ని ఫోర్బ్స్‌ తెలిపింది.
*  ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ నటుడు అక్షయ్‌ కావడం విశేషం.
*  కొన్ని నెలల క్రితం ఫోర్బ్స్‌ ప్రకటించిన ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న వంద మంది సెలబ్రిటీల్లో 33వ స్థానంలో నిలిచారు అక్షయ్‌. 
* ఇటీవల విడుదలైన ఆయన చిత్రం ‘మిషన్‌ మంగళ్‌’ ఇప్పటికే రూ.121 కోట్లు వసూలు చేసింది.
* ప్రముఖ హాలీవుడ్‌ నటుడు డ్వేన్‌ ‘రాక్‌’ జాన్సన్‌ దిగ్గజ నటుల ఈ జాబితాలో అగ్ర స్థానంలో నిలిచారు.
*  ఆయన ఆదాయం 89.4 మిలియన్‌ డాలర్లు. 
*‘‘డ్వేన్‌ జాన్సన్‌ త్వరలో రాబోతున్న తన సినిమా ‘జుమాంజి: ది నెక్స్ట్‌ లెవెల్‌’కు 23.5 మిలియన్‌ డాలర్లు పారితోషికం తీసుకున్నారు.
*  దీంతోపాటు తన సినిమాలకు వచ్చిన ఆదాయంలో 15 శాతం వాటా తీసుకుంటారు. 
* ఆయన నటించిన టీవీ సిరీస్‌ ‘బాల్లర్స్‌’కు ఒక్కో ఎపిసోడ్‌కు 7 లక్షల డాలర్లు అందుకుంటున్నారు.
*  దీంతో పాటు ఆయన పేరు మీద ప్రారంభించిన దుస్తులు, బూట్లు, హెడ్‌ ఫోన్ల బ్రాండ్ల నుంచి రాయల్టీ రూపంలో కోట్ల రూపాయలు తనకు  సమకూరుతోంద’’ని ఫోర్బ్స్‌ వెల్లడించింది.
* అవెంజర్స్‌’ సిరీస్‌లో థోర్‌ పాత్రలో నటించిన క్రిస్‌ హేమ్స్‌వర్త్‌ 76.4 మిలియన్‌ డాలర్లు, ఐరన్‌ మ్యాన్‌ పాత్రధారి రాబర్ట్‌ డౌనీ జూనియర్‌ 66 మిలియన్‌ డాలర్లతో రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
*  ఆ చిత్రంలో రాకెట్ పాత్రధారి బ్రాడ్లీ కూపర్‌ 57 మిలియన్‌ డాలర్లు, కెప్టెన్‌ అమెరికా పాత్రధారి క్రిస్‌ ఇవాన్స్‌ 43.5 మిలియన్‌ డాలర్లు, యాంట్‌ మ్యాన్‌గా నటించిన పాల్‌ రడ్‌ 41 మిలియన్‌ డాలర్లతో 6, 8, 9 స్థానాల్లో నిలిచారు.
* ప్రముఖ చైనీస్‌ కథానాయకుడు జాకీ చాన్‌ 58 మిలియన్‌ డాలర్లు, హాలీవుడ్‌ నటుడు ఆడమ్‌ శాండ్లర్‌ 57 మిలియన్‌ డాలర్లు, విల్‌ స్మిత్‌ 35 మిలియన్‌ డాలర్లు ఆర్జించి వరుసగా 5,7,10 స్థానాలు దక్కించుకున్నారు

views: 668

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams