Current Affairs Telugu Daily

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ తో మోదీ భేటీ
* కశ్మీర్‌ విషయంలో మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని అది పూర్తిగా భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక అంశమని ఫ్రాన్స్‌ తన వైఖరిని మరోసారి పునరుద్ఘాటించింది.
* మూడు దేశాల పర్యటనలో భాగంగా ఫ్రాన్స్‌లో ఉన్న ప్రధాని మోదీతో భేటీ అయిన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌ వారి అభిప్రాయాన్ని సుస్పష్టం చేశారు. 
* ఈ సందర్భంగా కశ్మీర్‌ అంశంతో పాటు ద్వైపాక్షిక, రక్షణ, ఉగ్రవాద నిర్మూలన చర్యలపై విస్తృతంగా చర్చించారు. 
* ఈ సందర్భంగా ఉగ్రవాద నిర్మూలన చర్యలపైనా ఇరుదేశాధినేతలు చర్చించారు. 
* శాంతి స్థాపనకు ఇరు దేశాలు కలిసి పనిచేయాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామన్నారు.
* పారిస్‌ ఒప్పందంలో భారత్‌ పాత్ర ఎనలేదని కొనియాడిన ఫ్రాన్స్‌ అదే తరహాలో అంతర్జాతీయ అంశాల్లో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. 
* మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ  ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ చేరుకున్నారు. 
* అనంతరం ఛాటే డి చంటిల్లీ భవనంలో అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌తో మోదీ సమావేశమయ్యారు. 
*  మోదీ ఫ్రాన్స్‌తో పాటు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ), బహ్రెయిన్‌ దేశాల్లో అయిదు రోజుల పాటు  పర్యటించనున్నారు.
*  బహ్రెయిన్‌ వెళతారు. ఆ దేశానికి వెళుతున్న తొలి భారత ప్రధాని మోదీయే కావడం విశేషం. 
* ఆగస్టు 25న తిరిగి ఫ్రాన్స్‌ వచ్చి జీ-7 సదస్సులో పాల్గొంటారు.

views: 613

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams