Current Affairs Telugu Daily

జాతీయ డోప్‌ టెస్టింగ్‌ ల్యాబొరేటరీ(ఎన్‌డీటీఎల్‌) అధికారిక గుర్తింపుని ఆర్నెళ్ల పాటు రద్దు 
 * జాతీయ డోప్‌ టెస్టింగ్‌ ల్యాబొరేటరీ(ఎన్‌డీటీఎల్‌) అధికారిక గుర్తింపుని ఆర్నెళ్ల పాటు రద్దు చేస్తూ వరల్డ్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ(వాడా) నిర్ణయం తీసుకుంది. 
* ఒలింపిక్స్‌కి మరో ఏడాది మాత్రమే గడువు ఉన్న తరుణంలో వాడా తీసుకున్న నిర్ణయం తీవ్ర కలవరం రేకెత్తిస్తోంది.
*  దేశీయంగా డోపింగ్‌ నిరోధం పట్ల తీసుకుంటున్న ముమ్మర చర్యలకు ఇది పెద్ద అడ్డంకిగా మారునుంది. 
* అయితే నేషనల్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ(నాడా) మాత్రం డోప్‌ పరీక్షలు నిర్వహించుకునేందుకు ఎలాంటి ఆటంకమూ ఉండదని సమాచారం. 
* కానీ, సేకరించిన నమూనాలకు ఇతర దేశాల్లోని గుర్తింపు పొందిన ల్యాబ్‌ల్లో పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. 
* ఎన్‌డీటీఎల్‌ ప్రమాణాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడమే గుర్తింపు రద్దునకు కారణమని మీడియాకిచ్చిన వివరణలో వాడా తెలిపింది.
*  ఈ మేరకు ఇటీవల చేపట్టిన తనిఖీల్లో వెల్లడైందన్నారు. వాడా ల్యాబొరేటరీ నిపుణుల బృందం మేలో తినిఖీలు ప్రారంభించిందని అనంతరం ఓ స్వతంత్ర క్రమశిక్షణా కమిటీ కూడా దర్యాప్తు చేసిందన్నారు. 
* వాటి నివేదికల ఆధారంగానే.. వాడా ఎక్జిక్యూటివ్‌ కమిటీ నిర్ణయాలు తీసుకుందన్నారు. ఎన్‌డీటీఎల్‌పై నిషేధం తక్షణమే అమలులోకి వస్తుందని వాడా స్పష్టం చేసింది.
* దీంతో ఇప్పటి వరకు ల్యాబ్‌లో వివిధ దశల్లో ఉన్న నామూనాలను గుర్తింపు పొందిన ఇతర ల్యాబ్‌లకు పంపాల్సి ఉంటుంది. 
* అలాగే వాడా సూచనల మేరకు ఎన్‌డీటీఎల్‌ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చి దిద్దితే నిషేధ కాలం పూర్తయ్యే లోపు మరోసారి గుర్తింపునకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు.
* నిబంధనల ప్రకారం వాడా నిషేధాన్ని సవాల్‌ చేస్తూ ఎన్‌డీటీఎల్‌ 21 రోజుల్లోగా కోర్ట్ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌(సీఏఎస్‌)ని ఆశ్రయించే వెసులుబాటు ఉంటుంది. 
* బీసీసీఐకి సైతం కష్టకాలం ఎదురుకానుంది. భారత్‌లో గుర్తింపు పొందిన ఏకైక ల్యాబ్‌ ఎన్‌డీటీఎల్‌ కావడంతో బీసీసీఐ కూడా తమ నమూనాలకు ఇక్కడికే పంపేది

views: 656

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams