Current Affairs Telugu Daily

అమెరికా జన్మత: పౌరసత్వ హక్కు రద్దుకు ఆదేశాలు
* డొనాల్డ్ ట్రంప్ మరోమారు వలసదారులపై ఆంక్షలు విదిలించారు.
*  అధికారం చేపట్టింది మొదలు వలసదారులను టార్గెట్ చేస్తున్న ట్రంప్ నవంబరు 6న జరగనున్న మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో తన మద్దతుదారులను ఆకట్టుకునేందుకు ట్రంప్ ‘అక్రమ వలస’ల అంశాన్ని అతి పెద్ద ఎజెండాగా మలచుకున్నారు. 
* ఈ క్రమంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. 
* చట్టవిరుద్దంగా ప్రవేశించినవారికి – అమెరికాయేతరులకు జన్మించే పిల్లలకు జన్మతః వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేయాలని ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
*  దీనిలో ఈ వర్గాలవారు అమెరికాలో పిల్లల్ని కన్నా వారు ఆ దేశ పౌరులు కారు అని తెలుస్తుంది. 
* ఇప్పటికే హెచ్1బీ – గ్రీన్ కార్డుల విషయంలో కఠినంగా ఆంక్షలు పెట్టి తాజాగా జన్మతః లభించే హక్కు రద్దుచేస్తే మిడ్ టర్మ్ ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీకు మంచి ఫలితాలు వస్తాయని ట్రంప్ ఆశిస్తున్నారు.
*  కాగా ఈ నిర్ణయం ఖరారైతే అది కోర్టుల పరిశీలనకు వెళ్లవచ్చని భావిస్తున్నారు.పలువురు తల్లిదండ్రులు పౌరసత్వం లభిస్తుందనే ఉద్దేశంతో తాత్కాలిక వీసాతో అమెరికాకి వెళ్లి అక్కడే బిడ్డను కంటున్నారు.
* అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ఆ గడ్డపై జన్మించిన వారందరికీ పౌరసత్వం కల్పిస్తుంది. 
* అమెరికాకు వలస వచ్చిన వారి సంతానానికీ ఇది వర్తిస్తుంది. 
* ఈ సవరణను ఉపయోగించుకొనే వలసదారులు దొడ్డిదారిన తమ దేశ పౌరసత్వాన్ని పొందుతున్నారన్నది ట్రంప్‌ వాదన. 
* జన్మతః లభించే పౌరసత్వాన్ని అమెరికా రద్దు చేస్తే ఆ ప్రభావం భారత్‌ నుంచి వెళ్లిన అనేక కుటుంబాలపై కూడా పడుతుంది. 
* ప్రత్యేకించి 2010 తరవాత దాదాపు 8లక్షల మంది భారతీయులు అమెరికాకు వెళ్లారు. 
* నిబంధనలు కఠినతరం చేయడంతో వీరిలో అత్యధికులకు గ్రీన్‌ కార్డులు లభించలేదు. 
* అలాగే అక్రమంగా వలస వచ్చిన వారి పిల్లలను ఎంత కాలం నిర్బంధంలో ఉంచాలన్న ఆంక్షలను కూడా ఎత్తివేయనున్నట్లు అమెరికా అధికార యంత్రాంగం పేర్కొంటోంది

views: 590

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams