Current Affairs Telugu Daily

భారత వృద్ధిరేటు 5.7 శాతానికి కుదించిన నోమురా
 * భారత వృద్ధిరేటు అంచనాను 5.7 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రపంచ ఆర్థిక సేవల సంస్థ నోమురా వెల్లడించింది.
*  వినిమయంలో నెలకొన్న మందకొడి, పెట్టుబడులు బలహీనంగా ఉండటం, సేవల రంగం నిరాశాజనక పనితీరు కారణంగా ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో వృద్ధిలో కోత విధించినట్లు పేర్కొంది. 
* జూలై-సెప్టెంబర్ మధ్యకాలంలో దేశ ఆర్థిక పరిస్థితులు కొద్దిగా మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయని  విడుదల చేసిన నివేదికలో తెలిపింది.
*  కుటుంబాలు ఖర్చులను తగ్గించుకోవడానికి అధిక ప్రాధాన్యతనివ్వడంతో వినిమయం భారీగా పడిపోయిందని, దీనికి తోడు పెట్టుబడులు బలహీనంగా ఉండటం, సేవల రంగం కూడా నిరాశావాదంగా ఉండటం వృద్ధికి బ్రేకులు వేస్తున్నాయని నోమురా తన రీసర్చ్ నోట్‌లో పేర్కొంది.
*  నోమురా కంపొజిట్ లీడింగ్ ఇండెక్స్(సీఎల్‌ఐ) జూలై-సెప్టెంబర్ మధ్యకాలానికి 99.8 నుంచి 99.9కి పెరిగినట్లు తెలిపింది.
*  పారిశ్రామిక పనితీరు ఆశాజనకంగా ఉండటం, ఈక్విటీ మార్కెట్లు కోలుకుంటుండటం, వడ్డీరేట్లు తగ్గుముఖం పట్టడం వృద్ధికి ఊతమివ్వనున్నాయని పేర్కొంది.
* దేశ ఆర్థిక వ్యవస్థపై ఆందోళన వ్యక్తంచేసిన నోమురా మందకొడి పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకునే అవకాశాలు లేవని స్పష్టంచేసింది.
*  2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 6.8 శాతంగా నమోదైంది. 
* 2014-15 తర్వాత ఇదే కనిష్ఠ స్థాయి వృద్ధి. 
* వినియోగదారుల్లో నమ్మకం సడలుతుండటం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అస్థిరంగా ఉండటం, అంతర్జాతీయ వాణిజ్యంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, కరెన్సీ యుద్ధం కొనసాగుతుండటం వృద్ధిపై ప్రభావం చూపుతున్నాయని తెలిపింది.
* ఈ ఏడాది తొలి మూడు నెలల్లో నమోదైన 5.8 శాతం వృద్ధికంటే రెండో త్రైమాసికంలో 5.7 శాతానికి తగ్గించినట్లు పేర్కొంది.
*  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(ఏప్రిల్-జూన్) మధ్యకాలానికి జీడీపీ గణాంకాలను కేంద్ర గణాంకాల శాఖ ఈ నెల 30న విడుదల చేయబోతున్నది.
*  తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన ఆటోమొబైల్ రంగం, వేలాది మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు.

views: 688

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams