Current Affairs Telugu Daily

క్యాబినెట్ కార్యదర్శిగా రాజీవ్ గౌబా
* దేశంలోనే అత్యున్నత అధికారి హోదా అయిన క్యాబినెట్ సెక్రటరీగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా నియమితులయ్యారు. 
* జార్ఖండ్ క్యాడర్‌కు చెందిన 1982 ఐఏఎస్ బ్యాచ్ అధికారి అయిన గౌబా క్యాబినెట్ సెక్రటరీ పదవిలో రెండేండ్లపాటు కొనసాగనున్నారు.
*  కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా రాజీవ్ గౌబా 31 ఆగస్టు 2017లో బాధ్యతలు స్వీకరించారు. 
* అంతకుముందు ఆయన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా, కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శిగా, జార్ఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగానూ విధులు నిర్వర్తించారు.
*  పంజాబ్‌లో పుట్టిన రాజీవ్ గౌబా పాట్నాయూనివర్సిటీ నుంచి ఫిజిక్స్‌లో పట్టాను పొందారు. 
* జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లును రూపొందించడంలో రాజీవ్ గౌబా కీలకపాత్ర పోషించారు.

views: 683

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams