Current Affairs Telugu Daily

స్టేట్ రూఫ్‌టాప్ సోలార్ అట్రాక్టివ్‌నెస్ ఇండెక్స్ లో  టాప్‌ ’ తెలంగాణ
* రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్‌కు సంబంధించి రాష్ర్టాలకు కేటాయించిన ర్యాంకుల్లో దేశంలోనే తెలంగాణ ద్వితీయస్థానాన్ని కైవసం చేసుకున్నది. 
* స్టేట్ రూఫ్‌టాప్ సోలార్ అట్రాక్టివ్‌నెస్ ఇండెక్స్ (సరళ్) పేరుతో కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధనశాఖ (ఎంఎన్‌ఆర్‌ఈ) ర్యాంకులను ప్రకటించింది. 
*  ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆయా రాష్ర్టాలకు వచ్చిన ర్యాంకులు, గ్రేడ్లను పునరుత్పాదక వనరుల సహాయమంత్రి ఆర్కే సింగ్ విడుదలచేశారు.
*  ఆయా రాష్ర్టాల్లో రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలు, సాధించిన ప్రగతిని పరిగణనలోకి తీసుకుని ర్యాంకులను ప్రకటించారు.
*  కర్ణాటకకు మొదటిస్థానం దక్కగా, తెలంగాణ రెండోస్థానంలో నిలిచింది. గుజరాత్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ మూడు, నాలుగు, ఐదు స్థానాలు పొందాయి.
* సరళ్ స్కోర్ల ఆధారంగా ఏ++, ఏ+, ఏ, బీ++, బీ+, బీ అనే ఆరు గ్రేడ్లను కేంద్రం కేటాయించింది.
*  ఇందులో తెలంగాణకు ఏ++ గ్రేడ్ దక్కింది. 
* మొదటి నాలుగుస్థానాల్లో ఉన్న కర్ణాటక, తెలంగాణ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు ఏ++ గ్రేడ్ కేటాయించారు. 
* సరళ్ స్కోరు 72.2 పాయింట్లను సాధించి తెలంగాణ దేశంలోనే రెండోస్థానంలో నిలిచింది. 
* మొదటిస్థానంలో ఉన్న కర్ణాటక 78.8 స్కోరు సాధించింది. గుజరాత్ 67.9, ఆంధ్రప్రదేశ్ 66.1, రాజస్థాన్ 62.2 స్కోరు సాధించాయి.
* ఐదు అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఒక్కో రాష్ట్రం ఆయా అంశాల్లో సాధించిన ఫలితాలను పరిశీలించి స్కోర్ వేశారు. 
* ఈ ఐదు అంశాల్లో వినియోగదారుల సంతృప్తికి సంబంధించిన అంశంలో దేశంలోనే అత్యధికంగా 80.59 స్కోరును తెలంగాణ సాధించింది.
*  ఓవరాల్‌గా అగ్రస్థానంలో ఉన్న కర్ణాటక  వినియోగదారుల సంతృప్తి, సానుకూలత అంశంలో 67.02 స్కోరు మాత్రమే సాధించింది.
*  పెట్టుబడులకు అనుకూలత అంశంలో కర్ణాటక (80.79) కన్నా తెలంగాణ మెరుగైన స్కోరు (81.79) సాధించడం గమనార్హం.

views: 622

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams