Current Affairs Telugu Daily

అమెరికా క్షిపణి ప్రయోగం సక్సెస్‌
* మధ్యశ్రేణి క్రూయిజ్‌ క్షిపణిని అగ్రరాజ్యం అమెరికా విజయవంతంగా ప్రయోగించింది.
* అణు సామర్ధ్యమున్న ఆయుధాల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందం నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించిన కొద్ది వారాల్లోనే అమెరికా ఈ ప్రయోగం చేపట్టడం గమనార్హం.
* లాస్‌ఏంజెలెస్‌ సమీపంలోని సాన్‌ నికొలస్‌ దీవిలో  ఈ ప్రయోగం చేపట్టినట్లు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది.
* భూమిపై నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించిందని పేర్కొంది. 
* అయితే, ఈ క్షిపణిలో అణ్వాయుధాలు లేవని పేర్కొంది. 

views: 639

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams