Current Affairs Telugu Daily

భారత్ - ఇస్టోనియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం
* యూరోపియన్ యూనియన్‌లో భాగస్వామ్య దేశమైన ఇస్టోనియా - భారత్‌ల మధ్య వ్యాపార, వాణిజ్య రంగాల్లో సహకారం మరింత బలపడే దిశగా అంగీకరానికి వచ్చాయి.
* ముఖ్యంగా ఐటీ, ఈ-గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడేలా దోహదపడేందుకు వీలుగా భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఎస్టోనియా అధ్యక్షుడు కెర్‌స్టీ కల్జూలియాద్ చర్చలు జరిగాయి.
* లూథియానా, లాట్వియా, ఇస్టోనియా దేశాల ప్రతినిధులతో ద్వైపాక్షిక చర్చల నిమిత్తం వెంకయ్యనాయుడు ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఇస్టోనియా అధ్యక్షుడితో సమావేశమయ్యారు.
*  ఉప రాష్టప్రతి పర్యటనలో ముఖ్యమైన రంగాల్లో ఇరు దేశాల మధ్య పరస్పర అవగాహన దిశగా ద్వైపాక్షిక చర్చలు సాగాయి.
*  ప్రాంతీయ, ఇతర దేశాలతో సహకారం తదితర అంశాలపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. 
*  ఇస్టోనియా స్వాతంత్య్ర సమరయోధులకు వబుదూస్ స్వ్కేర్ వద్ద  నివాళులు అర్పిచిన  భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు

views: 581

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams