Current Affairs Telugu Daily

ఐదు రూపాయలకు అరగంట సైకిల్ పథకాన్ని ప్రారంభించనున్నహర్యానా 
* హర్యానాలోని పంచకూల ప్రజలు  పబ్లిక్ బైస్కిల్ షేరింగ్ పథకం ద్వారా లబ్ధిపొందనున్నారు. 
* ఈ పథకం కింద అరగంట పాటు సైకిల్ వినియోగించుకునేందుకు కేవలం ఐదు రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. 
* పర్యావరణ హితాన్ని కోరుతూ హర్యానా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. 
* ఈ పథకాన్ని హర్యానా సీఎం మనోహర్ లాల్ ప్రారంభించనున్నారు. 
* పంచకూలలో తొలిసారిగా ఈ పథకానికి శ్రీకారం చుడుతున్నారు.
* ఈ పథకం నిర్వహణకు పట్టణంలోని 20చోట్ల సైకిల్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. 
* ఈ స్టేషన్లలో 200 సైకిళ్లను వినియోగదారులకు అందుబాటులో ఉంచారన్నారు. 
* డిమాండ్‌ను అనుసరించి సైకిళ్ల సంఖ్యను పెంచుతామని తెలిపారు.
*  ఈ పథకానికి ఆదరణ కల్పిచేందుకు త్వరలో సైకిల్‌థాన్, సైకిల్ ర్యాలీలను నిర్వహించనున్నామని పేర్కొన్నారు.
*  సైకిళ్ల వినియోగదారుల కోసం ప్రత్యేక యాప్ రూపొందించామని, దీనిని లబ్ధిదారులు డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. 
* రూ. 100 చెల్లించి ఒక నెల కోసం సైకిల్ బుకింగ్ చేసుకోవచ్చని, తద్వారా 30 రోజుల పాటు ప్రతీరోజూ 30 నిముషాలపాటు సైకిల్ వినియోగించుకోవచ్చని  హర్యానా సీఎం మనోహర్ లాల్ వివరించారు.

views: 748

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams