Current Affairs Telugu Daily

మిలటరీ గ్రేడ్‌ ఫ్రీక్వెన్సీకి సాఫ్ట్‌వేర్‌ అనుసంధానం
* త్రివిధ దళాల్లో హ్యాకింగ్‌ దుర్భేద్యమైన సమాచార వ్యవస్థ సిద్ధమైంది. 
* ప్రస్తు తం మిలటరీ గ్రేడ్‌ రేడియో ఫ్రీక్వెన్సీతో సాగుతున్న కమ్యూనికేషన్‌ ఇకపై కొత్తపుంతలు తొక్కనుంది. 
* రక్షణ రంగ పరిశోధన సంస్థలు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో సాఫ్ట్‌వేర్‌ డిఫైన్డ్‌ రేడియో (ఎస్‌డీఆర్‌) వ్యవస్థను వెపన్స్‌ ఎలకా్ట్రనిక్స్‌ సిస్టమ్‌ ఇంజనీరింగ్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌ (డబ్ల్యూఈఎ్‌సఈఈ), డీఆర్‌డీవో, బీఈఎల్‌ సంయుక్తంగా ఎస్‌డీఆర్‌ను రూపొందించాయి. త్రివిధ దళాలు వినియోగించుకోవచ్చని తెలిపాయి.
* సాఫ్ట్‌వేర్‌, అల్‌గారిథమ్‌ ఆధారంగా ఎస్‌డీఆర్‌ పనిచేస్తుంది.
* వేగంగా సమాచారాన్ని డేటాను లైవ్‌ వీడియోలను చేరవేస్తుంది.
* ఎస్‌డీఆర్‌లో ఫ్రీక్వెన్సీలను మార్చుకుని సమాచారాన్ని అందుకోవచ్చు.
* నెట్‌వర్క్‌ బలహీనంగా ఉన్నా ఎస్‌డీఆర్‌ అద్భుతంగా పనిచేస్తుంది.
* పాత పరికరాల్లో డేటాను నిల్వ చేసే సదుపాయం లేదు. ఎస్‌డీఆర్‌లో డేటాను భద్రపరచడమే కాకుండా పరికరం పాడైతే ఆ డేటాను కొత్త పరికరంలోకి మార్చుకోవచ్చు.
ప్రస్తుతం క్షేత్రస్థాయిలో, యుద్ధరంగంలో ఉన్న జవాన్లు-కంట్రోల్‌ రూం మధ్య నిర్ణీత ఫ్రీక్వెన్సీలో సమాచారాన్ని అందిపుచ్చుకునేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న పరికరాలు ఉపయోగపడుతున్నాయి.
* ఇప్పుడున్న వాకీటాకీలు, రేడియో వ్యవస్థల్లో క్రాస్‌ కమ్యూనికేషన్‌ బెడద ఉంది. వీటిని జామర్లు, హ్యకర్లు నిలువరించే ముప్పు ఉంది.

views: 700

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams