Current Affairs Telugu Daily

అభినందన్‌ను పట్టుకున్న పాక్‌ కమాండో హతం
 *  భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను పట్టుకున్న పాక్‌ కమాండో అహ్మద్‌ ఖాన్‌ హతమయ్యాడు.
*  నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం జరిపిన కాల్పుల్లో అతడు మృతిచెందాడు. 
* ఈ ఏడాది ఫిబ్రవరిలో అభినందన్‌ నడిపిన ఐఏఎఫ్‌ జెట్‌ పాక్‌ సరిహద్దు వద్ద కూలడంతో ఆయన పాక్‌ సైన్యానికి పట్టుబడటం ఆయనను శత్రు సైన్యం చిత్రహింసలకు గురిచేయడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
*  అహ్మద్‌ ఖాన్‌ పాక్‌ సైన్యం ప్రత్యేక సేవా గ్రూప్‌లో సుబేదార్‌గా పనిచేస్తున్నాడు.
*  చొరబాటుదారులను భారత్‌లోకి పంపేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో నాక్యాల్‌ సెక్టార్‌లో ఈ నెల 17న భారత సైన్యం జరిపిన కాల్పుల్లో అతడు హతమయ్యాడు. 
* అభినందన్‌ పట్టుబడిన సందర్భంలో విడుదలైన ఫొటోల్లో అహ్మద్ ఖాన్‌ ఆయన వెనుకే ఉన్నాడు. 
* బాలాకోట్‌ వద్ద జరిపిన దాడుల అనంతరం పాక్‌ జెట్‌లను తరుముకుంటూ వెళ్లిన మిగ్‌ 21ను పాక్‌ సైన్యం కూల్చివేసింది. ఆ సమయంలో అభినందన్‌ పట్టుబడ్డారు.
*  భారత్‌ - పాక్‌ సరిహద్దులో పాక్‌ నుంచి ఉగ్రవాదులను భారత్‌కు అక్రమంగా తరలించేందుకు అహ్మద్‌ ఖాన్‌ కీలకంగా వ్యవహరించేవాడని తెలుస్తోంది.
*  దీంతో పాటు జైషే మహ్మద్‌కు చెందిన సుశిక్షితులైన ఉగ్రవాదులను ఉపయోగించి  కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని సజీవంగా ఉంచేందుకు పాక్‌ రచించే వ్యూహాలను అతడు అమలు చేసేవాడని సమాచారం.

views: 675

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams