Current Affairs Telugu Daily

చిదంబరంపై లుక్‌అవుట్‌ నోటీసులు జారీ
* ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో తాత్కాలిక ఉపశమనం కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరంకు నిరాశే ఎదురైంది. 
* ఈ కేసులో దిల్లీ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన ప్రత్యేక లీవ్‌ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి ధర్మాసనానికి పంపినట్లు జస్టిస్‌ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. 
* మరోవైపు చిదంబరం ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు. దీంతో ఆయనపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు. 
* ఈ కుంభకోణం మొత్తానికి చిదంబరం సూత్రధారిగా ఉన్నట్లు అర్థమవుతోందని దిల్లీ హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. 
* దీంతో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.
*  దీంతో ఆయన్ను అరెస్టు చేసేందుకు సీబీఐ అధికారులు చిదంబరం నివాసానికి వెళ్లగా ఆయన అక్కడ లేదు.
*  ఈ రోజు ఉదయం మరోసారి వెళ్లగా.. అప్పుడు కూడా చిదంబరం అందుబాటులో లేరు. దీంతో ఆయన ఆచూకీ కనుగొనేందుకు ఈడీ లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేసింది. 
* మరోవైపు ముందస్తు బెయిల్‌పై అత్యవసర విచారణ జరిపేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు పిటిషన్‌ను తీసుకెళ్లాలని చిదంబరరం తరఫు న్యాయవాది కపిల్‌ సిబల్‌ ప్రయత్నించినప్పటికీ అది ఫలించలేదు.

views: 613

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams