Current Affairs Telugu Daily

హైదరాబాద్‌లో అతి భారీ అమెజాన్‌ క్యాంపస్‌
* ఇ-కామర్స్‌ రంగంలో అగ్రగామి సంస్థ అమెజాన్‌ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రాంగణం ప్రపంచంలోనే అతిపెద్దది.
* పదివేల మందికి ఉపాధి కల్పించేలా పది ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ ప్రాంగణం ప్రారంభం కానుంది. 
* రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
* అమెజాన్‌ ఇండియా సీనియర్‌ ఉపాధ్యక్షుడు, కంట్రీ మేనేజర్‌ అమిత్‌ అగర్వాల్‌, సంస్థ స్థిరాస్తి, వసతుల  విభాగం సంచాలకుడు జాన్‌ స్కోట్లర్‌ కూడా పాల్గొంటారు.
* 2016 మార్చి 31న అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా దీనికి శంకుస్థాపన జరిగింది.
*  సుమారు 15 అంతస్తులలో 30 లక్షల చదరపు అడుగుల స్థలంలో దీని నిర్మాణం చేపట్టారు.
*  ఇందులో పది లక్షల చదరపు అడుగులను పార్కింగుకు కేటాయించారు. పూర్తిగా అధునాతన నమూనాలో సకల వసతులతో దీనిని నిర్మించారు.
*  అమెజాన్‌కు ప్రస్తుతం ఏడు వేల మంది ఉద్యోగులున్నారు. వచ్చే నెలాఖరు నాటికి ఈ సంఖ్య పదివేలకు చేరనుంది. 
* అమెజాన్‌ దశాబ్దం క్రితం హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించింది. ఇప్పటికే శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. 
* తెలంగాణలో అనుకూలతలను పరిగణనలోకి తీసుకొని ఇక్కడ రూ.400 కోట్ల పెట్టుబడితో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాంగణం నిర్మించాలని నిర్ణయించింది. 
* దీనికి రాష్ట్ర ప్రభుత్వం పది ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ప్రాంగణం నుంచి అమెజాన్‌ ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలను నిర్వహించనుంది. 
* వ్యాపార నిర్వహణ ప్రణాళికలకు తోడు కొత్త సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన, వాణిజ్య విస్తరణ కార్యాచరణకు ఇది కేంద్రం కానుంది.ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న ఇ-కామర్స్‌ సంస్థ * అమెజాన్‌ అతిపెద్ద ప్రాంగణానికి హైదరాబాద్‌ వేదిక కావడం ద్వారా రాష్ట్రానికి విశేష ఖ్యాతి దక్కనుంది. మరిన్ని సంస్థలు హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకునే వీలుంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, ఐబీఎం, ఒరాకిల్‌ వంటి అనేక బహుళజాతి సంస్థలు తెలంగాణలో తమ కార్యాలయాలను నడుపుతున్నాయి. 
* దేశీయ ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్‌, విప్రో, టీసీఎస్‌, టెక్‌ మహేంద్ర వంటి కంపెనీలెన్నో తెలంగాణలో తమ కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. 
* ఐటీ దిగ్గజం గూగుల్‌ సంస్థ హైదరాబాద్‌లో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో తమ ప్రాంగణాన్ని నెలకొల్పింది. గూగుల్‌ సంస్థ అమెరికా బయట అదీ హైదరాబాద్‌లో ఇంత పెద్దఎత్తున తమ కార్యకలాపాల్ని విస్తరించడం విశేషం. 
* ప్రపంచ ప్రఖ్యాత యాపిల్‌ కంపెనీ హైదరాబాద్‌లో 2016 మే 19న మ్యాప్స్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభించింది. నానక్‌రామ్‌గూడలోని వేవ్‌రాక్‌లో యాపిల్‌ సంస్థ కార్యాలయం మొదలైంది. 
* యాపిల్‌ ఉత్పత్తులైన ఐ ఫోన్‌, ఐ ప్యాడ్‌, యాపిల్‌ వాచ్‌ల వంటి ఉత్పత్తులకు మ్యాప్‌ల అభివృద్ధి పనులను ఈ కేంద్రం నుంచి సాగిస్తున్నారు. 

 

views: 619

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams