Current Affairs Telugu Daily

మహిళలకు స్వతంత్రంగా ప్రయాణించే హక్కు కల్పిస్తూ సౌదీ అరేబియా ఆదేశాలు
 * సౌదీ అరేబియాలో ఇటీవలి కాలంలో మహిళల పట్ల వివక్ష తగ్గుతోంది. 
* పురుషులతో సమానంగా వారికి హక్కులు కల్పించేందుకు అక్కడి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొస్తోంది. 
* తాజాగా సౌదీ మహిళలకు ‘ప్రయాణ స్వేచ్ఛ’ లభించింది.
* 21ఏళ్లు పైబడిన మహిళలు ఇకపై తమ ఇంట్లోని పురుషుల అనుమతి లేకుండానే పాస్‌పోర్టు తీసుకోవచ్చు. విదేశాలకు కూడా వెళ్లొచ్చు. ఈ సంస్కరణలను  అమల్లోకి తీసుకొచ్చారు.
* ఆగస్టు ఆరంభంలో ఈ సంస్కరణలను సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. 
* నేటి నుంచి వాటిని అమలు చేస్తున్నట్లు సౌదీ పాస్‌పోర్టు విభాగం ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. 
* ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సౌదీ అరేబియాలో దేశంలో మహిళలకు కఠిన నిబంధనలు ఉంటాయి. 
* గార్డియన్‌షిప్‌ చట్టం ప్రకారం.. అక్కడి మహిళలు చదువుకోవాలన్నా, ప్రయాణాలు చేయాలన్నా తండ్రి, భర్త లేదా సోదరుడి నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
*  అయితే గత కొన్నిరోజులుగా ఈ గార్డియన్‌షిప్‌ చట్టంలో మార్పులు తీసుకొస్తున్నారు. 
* మహిళ ప్రగతి కోసం సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ పలు సంస్కరణలు తీసుకొస్తున్నారు.
*  ఇప్పటికే మహిళలు డ్రైవింగ్‌ చేయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసిన విషయం తెలిసిందే. 
* గతేడాది నుంచి అక్కడి మహిళలు సొంతంగా వాహనాలు నడుపుతున్నారు. ఇక పురుషులతో పాటు మహిళలు కూడా మైదానాలకు వచ్చి మ్యాచ్‌లు వీక్షించే అవకాశం కల్పించారు.
* సౌదీ అరేబియా అధికారికంగా " కింగ్డం ఆఫ్ సౌదీ అరేబియా " (కె.ఎస్.ఎ)  ఒక అరబ్ దేశం. 
* ఇది పశ్చిమాసియాలో ఉంది. ఇది అరేబియన్ ద్వీపకల్పంలో అత్యధిక భాగం విస్తరించి ఉంది. దేశం వైశాల్యం 50,000 చ.కి.మీ. భౌగోళికంగా సౌదీ అరేబియా ఆసియా దేశాలలో 5వ స్థానంలో మరియు అరబ్ ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. 
* సౌదీ అరేబియా -కరెన్సీ రియాల్ 

views: 667

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams