Current Affairs Telugu Daily

‘ఇసార్‌ ఒరేషన్‌’కు ఎంపికైన డాక్టర్‌ అపూర్వ
దేశ వ్యాప్తంగా నిర్వహించిన యువ ఇసార్‌(ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ అసిస్టెడ్‌ రీప్రొడక్షన్‌) కాన్ఫరెన్సులో నెల్లూరుకు చెందిన ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్‌ అపూర్వ ప్రథమ స్థానంలో నిలిచారు.
*ఈనెల 16, 17, 18 తేదీలలో ఆగ్రాలో యువ ఇసార్‌ పేరుతో నిర్వహించిన కాన్ఫరెన్సులో ఈమె పాల్గొన్నారు.
*దేశ వ్యాప్తంగా 50 మంది గైనకాలజిస్టులు ఉన్న జాబితాను ఇస్సార్‌ సంస్థ మొదట ఎంపిక చేసింది.ఈ ఒరేషన్‌లో నెల్లూరుకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్‌ యశోధర, డాక్టర్‌ పీఎస్‌ రెడ్డిల కుమార్తె ప్రముఖ గైనకాలజిస్టు, సంతాన సాఫల్యత నిపుణురాలు డాక్టర్‌ అపూర్వ వారందరిని అధిగమించి ప్రథమ స్థానంలో నిలిచారు.
*ప్రేక్షకుల ద్వారా నిర్వహించిన లైఫ్‌ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ విధానం, న్యాయ నిర్ణేతల మార్కుల ఆధారంగా అపూర్వ ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. దాంతో వచ్చే ఏడాది హైదరాబాద్‌లో ఇసార్‌- 2020 పేరుతో నిర్వహించే కాన్ఫరెన్సులో పాల్గొనేందుకు ఆమె ఎంపికయ్యారు. అక్కడ గైనకాలజీ వైద్యులను ఉద్దేశించి గంటసేపు ఒరేషన్‌ ఇచ్చే అరుదైన అవకాశాన్ని పొందారు

views: 702

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams