Current Affairs Telugu Daily

సీఏపీఎఫ్‌ పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లుగా నిర్ణయిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ

అన్ని రకాల కేంద్ర సాయుధ పోలీసు బలగాల(సీఏపీఎఫ్‌) పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లుగా నిర్ణయిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
*ఈ బలగాల్లో కానిస్టేబుల్‌ నుంచి కమాండెంట్‌ (సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ సమాన హోదా) స్థాయి వరకు ఉన్న నాలుగు కేంద్ర బలగాల అధికారులు (సెంట్రల్‌ రిజర్వు పోలీస్‌ ఫోర్స్, బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్‌ పోలీస్‌ ఫోర్స్, సహస్త్ర సీమా బల్‌) ఇకపై 57 ఏళ్లకు బదులుగా 60 ఏళ్లకు పదవీ విరమణ చేయనున్నారు.
*డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌(డీఐజీ) నుంచి అత్యున్నత ర్యాంకు డైరెక్టర్‌ జనరల్‌(డీజీ) వరకు ఉన్న ఈ నాలుగు బలగాల అధికారుల రిటైర్మెంట్‌ వయస్సు కూడా ఇకపై 60 ఏళ్లే.


views: 624

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams