Current Affairs Telugu Daily

ప్రపంచంలోనే అత్యధికంగా సల్ఫర్‌డై ఆక్సైడ్‌ను వెదజల్లుతున్న దేశాల్లో భారత్‌ మొదటి స్థానం

ప్రపంచంలోనే అత్యధికంగా సల్ఫర్‌డై ఆక్సైడ్‌(so2)ను వెదజల్లుతూ వాతావరణ కాలుష్యానికి గురవుతున్న దేశాల్లో భారత్‌ మొదటి స్థానంలో ఉందని ఓ పరిశోధనలో తేలింది.
*గ్రీన్‌పీస్‌ అనే  సంస్థ ప్రపంచవ్యాప్తంగా so2ను విడుదల చేస్తున్న దేశాలపై నిర్వహించిన పరిశోధన తాలూకు నివేదికలను విడుదల చేసింది.
*వీటిని ఆధారంగా చేసుకుని ‘నాసా’ విశ్లేషణ చేసింది.
*ఓజోన్‌ మానిటరింగ్‌ ఉపగ్రహం ద్వారా చేసిన ఈ పరిశోధనలో ప్రపంచంలో భారత్‌లో 15శాతం కంటే ఎక్కువ so2 ను వెదజల్లుతున్న కేంద్రాలు ఉన్నట్లు వెల్లడించింది.
*భారత్‌లో ఎక్కువగా so2 విడుదల చేస్తున్న ప్రదేశాల్లో మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి, తమిళనాడులోని నైవేలీ ఒడిశాలోని జార్సుగూడ, తాల్చేర్‌, ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా, గుజరాత్‌లోని కచ్, తెలంగాణలోని రామగుండం, మహారాష్ట్రలోని చంద్రాపూర్‌, కొరాడి ప్రాంతాలు ఉన్నట్లు పేర్కొంది.
*అదేవిధంగా విశ్లేషణ ప్రకారం భారత్‌లో ఉన్న మొక్కలకు వాయుకాలుష్యాన్ని డీసల్ఫరైజేషన్‌ చేసే సాంకేతిక లేదని వెల్లడించింది. 
**గాలి కాలుష్యం కారణంగా ప్రపంచంలో ప్రతి సంవత్సరం 4.2 మిలియన్‌ ప్రజలు మరణిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.


views: 731

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams