Current Affairs Telugu Daily

ఫిరోజ్‌షా కోట్లలో స్టాండ్‌కు కోహ్లీ పేరు
భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌ అరంగ్రేటం చేసి 11 ఏళ్లు.
*దిల్లీకి చెందిన కోహ్లీ అంతర్జాతీయ కెరీర్‌లో 11 ఏళ్లు పూర్తైన సందర్భంలో దిల్లీ డిస్ట్రిక్ట్‌ క్రికెట్ అసోషియేషన్‌ (డీడీసీఎ) అతడిని గౌరవించింది.
*దిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో ఓ స్టాండ్‌కు కోహ్లీ పేరును పెట్టింది. ఈ విషయాన్ని డీడీసీఎ తన ట్విటర్‌ ఖాతాలో ఉంచింది.
*‘ఆగస్టు 18, 2008 దిల్లీ కుర్రాడు అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. 11 ఏళ్లలో క్రికెట్‌ లెజెండ్‌గా మారాడు. అతడి అద్భుత ప్రదర్శన చూస్తుంటే డీడీసీఎకు గర్వంగా ఉంది. కెరీర్‌లో ఆటగాడిగా, కెప్టెన్‌గా ఎన్నో రికార్డులను అందుకున్నందుకు సంతోషంగా ఉంది. ఈ మధుర క్షణాల జ్ఞాపకార్థంగా ఫిరోజ్‌షా కోట్ల మైదానంలోని ఓ స్టాండ్‌కు కోహ్లీ పేరును పెట్టాలని నిర్ణయించుకున్నాం’ అని డీడీసీఎ ట్వీట్ చేసింది.  

views: 700

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams