Current Affairs Telugu Daily

హైదరాబాద్‌లో అతి పెద్ద అమెజాన్‌ క్యాంపస్‌
అమెరికా ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ప్రపంచంలోనే అతి పెద్ద క్యాంపస్‌ భవనాన్ని త్వరలోనే హైదరాబాద్‌లో ప్రారంభించనుంది.
*నానక్‌రాంగూడలోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో 10 ఎకరాల స్థలంలో అత్యాధునిక మౌలికవసతులతో దీనిని నిర్మించారు. 15 అంతస్తుల భవనంలో 10లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో పార్కింగ్‌ ప్రదేశం, మరో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉద్యోగులు పనిచేసే కార్యాలయ ప్రాంగణాన్ని నిర్మించారు.
*దీన్ని ఆగష్టు 21న లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
*అమెజాన్‌ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, కంట్రీ మేనేజర్‌ అమిత్‌ అగర్వాల్‌, అమెజాన్‌ గ్లోబల్‌ రియల్‌ ఎస్టేట్‌ అండ్‌ ఫెసిలిటీస్‌ డైరెక్టర్‌ జాన్‌ స్కోటీర్‌, కంపెనీ ప్రతినిధులు పాల్గొననున్నారు.
*హైదరాబాద్‌కు అమెజాన్‌ అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. దేశంలోనే అతిపెద్ద ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ (గోదాము)ను రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో ఇప్పటికే ఏర్పాటు చేసింది. ఇది నాలుగు లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో ఉంది. 2020 మధ్యకాలం నాటికి దీన్ని 5.8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంకు పెంచుకోవాలన్న యోచనలో ఉంది.
Amazonఃః
  • CEO&Founder: Jeff Bezos  
  • Founded: 5 July 1994, Bellevue, Washington, United States

views: 676



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams