Current Affairs Telugu Daily

టీమిండియా హెడ్‌ కోచ్‌గా రవిశాస్త్రి
* భారత జాతీయ పురుషుల క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి పదవి 2021 టి20 ప్రపంచకప్‌ వరకు దక్కింది. 
*  బీసీసీఐ క్రికెట్‌ సలహా కమిటీ  ప్రామాణికంగా నిర్దేశించుకున్న శిక్షణా రీతులు, అనుభవం, సాధించిన ఘనతలు, సమాచారం వినియమం, ఆధునిక శిక్షణా పరిజ్ఞానం అనే ఐదు అంశాలకు శాస్త్రినే తగినవాడంటూ కపిల్, మాజీ కోచ్‌ అన్షుమన్‌ గైక్వాడ్, మహిళల జట్టు మాజీ కెప్టెన్‌ శాంత రంగస్వామితో కూడిన సీఏసీ సభ్యులు నిర్ణయం వెలువరించారు. 
* ఈ పదవికి దరఖాస్తు చేసిన న్యూజిలాండ్‌ మాజీ కోచ్‌ మైక్‌ హెసన్, శ్రీలంకకు కోచ్‌గా పనిచేసిన టామ్‌ మూడీ 2, 3 స్థానాలతో సరిపెట్టుకున్నారు.
*  కపిల్‌ బృందం వీరితోపాటు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ రాబిన్‌సింగ్, జట్టు మాజీ మేనేజర్‌ లాల్‌సింగ్‌ రాజ్‌పుత్‌లను ఇంటర్వ్యూ చేసింది. 
* మరో దరఖాస్తుదారు ఫిల్‌ సిమన్స్‌ (వెస్టిండీస్‌) మాత్రం అంతకుముందే తప్పుకొన్నాడు.
*  హెసన్, రాబిన్‌సింగ్, రాజ్‌పుత్‌ నేరుగా హాజరై తమ ప్రణాళికలు వివరించారు. మూడీ, ప్రస్తుతం భారత జట్టుతో కరీబియన్‌ దీవుల పర్యటనలో ఉన్న రవిశాస్త్రి టెలి కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రక్రియలో పాల్గొన్నారు. 
* 2017 జులైలో శాస్త్రిని హెడ్‌ కోచ్‌గా అప్పటి సీఏసీ సభ్యులు సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌ ఎంపిక చేశారు.
*  అప్పట్లో అతడి నియామకంపై వీరంతా కెప్టెన్‌గా కోహ్లి అభిప్రాయాన్ని తీసుకు న్నారు. ఇప్పుడు మాత్రం అదేమీ లేకుండానే నిర్ణయం తీసుకున్నామని కపిల్‌ తెలిపాడు

views: 621

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams