Current Affairs Telugu Daily

మోస్ట్‌ పాపులర్‌ సీఎం; మూడో స్థానంలో వైఎస్‌ జగన్‌
*  ప్రజా నాయకుడిగా ఎదిగి ముఖ్యమంత్రిగా పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మరో గౌరవం దక్కింది. 
* వీడీపీ అసోసియేట్స్‌ నిర్వహించిన సర్వేలో మోస్ట్‌ పాపులర్‌ సీఎంల జాబితాలో ఆయన మూడో స్థానంలో నిలిచారు. 
* దేశవ్యాప్తంగా 71 శాతం మంది సీఎం జగన్‌ పాలన పట్ల సంతృప్తికరంగా ఉన్నట్లు ‘దేశ్‌ కా మూడ్‌’ పేరిట చేపట్టిన సర్వేలో తేలినట్లు వీడీపీ అసోసియేట్స్‌ వెల్లడించింది. * సీఎం జగన్‌ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘నవరత్నాలు’  జాతీయ స్థాయిలో ఆకట్టుకుంటున్నాయని ఈ సందర్భంగా తేల్చింది.
* ఈ క్రమంలో అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న హామీలను అమలు చేసేందుకు వైఎస్‌ జగన్‌ తీసుకుంటున్న కీలక నిర్ణయాలే ఆయన పాలనపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
*  ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన నాటి నుంచే వివిధ సామాజిక వర్గాల అభివృద్ధికై ఆయన చేస్తున్న కృషి దేశవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చిందని పేర్కొంటున్నారు. 
* సర్వే వివరాల ప్రకారం మోస్ట్‌ పాపులర్‌ సీఎంల జాబితాలో ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్ అగ్రభాగాన నిలిచారు. ఆయనకు 81 శాతం మంది మద్దతు లభించింది. 
* ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ 72 శాతంతో రెండో స్థానంలో, వైఎస్‌ జగన్‌ 71 శాతం మంది ప్రజల మద్దతుతో మూడో స్థానంలో ఉన్నారు.
* తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు ఐదో స్థానంలో నిలిచారు.
* దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో ఈ సర్వేను నిర్వహించారు. మొత్తం 11,252 మంది సర్వేలో పాల్గొనగా వారిలో 10,098 మంది ఓటర్లున్నారు.
* ఆగస్టు 9 నుంచి ఆగస్టు 14 వరకు ఈ సర్వే నిర్వహించారు

views: 877

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams