Current Affairs Telugu Daily

తేలికైన సౌరఫలకాలు  తయారు చేసిన ఆస్ట్రేలియా
*  సౌరశక్తిని విస్తృత స్థాయిలో వాడకపోయేందుకు కారణాలు  బరువు ఎక్కువగా ఉండటం.
*  కావాల్సినట్లు మడతపెట్టే అవకాశం లేకపోవడం వంటివి రెండు కారణాలు.
*  ఈ సమస్యను అధిగమించేందుకు ఆస్ట్రేలియాలోని సన్‌మ్యాన్‌ ఎనర్జీ సంస్థ వినూత్నమైన సౌర ఫలకలను అభివృద్ధి చేసింది.
*  తేలికగా, గాజు లేకుండా తయారు చేసింది. ఫలితంగా వీటిని ఎలా అంటే అలా మడతపెట్టి వాడుకోవచ్చు. దీంతో వంపులున్న భవనాల్లోనూ ఎక్కువ సంఖ్యలో సోలార్‌ప్యానెల్స్‌ ఏర్పాటు చేసి విద్యుదుత్పత్తి పెంచుకోవచ్చు.
*  ఈ–ఆర్చ్‌ అని పిలుస్తున్న ఈ సోలార్‌ప్యానెల్‌ ఒకొక్క దాంట్లో దాదాపు వంద వరకు ఘటకాలు ఉంటాయి.
*  రెండు మిల్లీమీటర్ల మందం మాత్రమే ఉండే ఈ ప్యానెల్‌ను కావాల్సిన ఆకారంలో మార్చుకునే అవకాశం ఉంది.
* సంప్రదాయ సోలార్‌ ప్యానెల్స్‌ ఒకొక్కటి 20 కిలోల బరువు ఉంటే ఈ ఆర్చ్‌ 2.4 కిలోలు మాత్రమే ఉంటుంది.
* భవనాల కిటికీలతో పాటు పైకప్పులపై కూడా ఇవి తేలిగ్గా ఇమిడిపోతాయని సన్‌మ్యాన్‌ ఎనర్జీ సీఈవో డారెన్‌మిల్లర్‌ తెలిపారు.   

views: 664

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams