Current Affairs Telugu Daily

ప్రముఖ గీత రచయిత శివగణేష్ కన్నుమూత
* ప్రముఖ గీత రచయిత శివగణేష్‌ (63) కన్నుమూశారు.
* హైదరాబాద్‌లో ఆయన గుండెపోటుతో మరణించారు. 
* తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో 1956 ఆగస్టు 10న జన్మించారాయన. 
* ఎక్కువ కాలం చెన్నైలోనే గడిపారు.  నాలుగేళ్ల కిందట హైదరాబాద్‌ వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు.
*  ఎమ్మెస్సీలో గోల్డ్‌మెడల్‌ సాధించిన శివగణేష్‌ ఏడు భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. తెలుగు, తమిళ భాషల్లో పీహెచ్‌డీ చేశారు. తెలుగు, తమిళ, కన్నడ తదితర భాషల్లో వెయ్యి పాటలకు పైగానే రాశారు.
*  నటుడు శరత్‌బాబుతో స్నేహం ఉండటంతో  ‘ఆస్తి మూరెడు ఆశ బారెడు’ సినిమాలో పాటలను శివగణేష్‌ రాశారు. 
* ఆ తర్వాత పలు చిత్రాలకు పాటలు రాసే అవకాశాలు వచ్చాయి. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం చిత్రాలకు  ఎక్కువగా పని చేశారు. 
* ‘జీన్స్‌’లో ప్రియా..ప్రియా.. చంపొద్దే, ‘ఒకే ఒక్కడు’లో నెల్లూరి నెరజాణ.. ‘7జి బృందావన్‌ కాలనీ’లో తలచి తలచి చూసా.. లాంటి పాటలు శివగణేశ్‌ కలం నుంచి జాలువారినవే. ‘ప్రేమికులరోజు’, ‘బోయ్స్‌’, ‘నరసింహా’, ‘ఎంతవాడు గానీ’, ‘ఉల్లాసంగా’ ‘బ్రహ్మచారి’, ‘లవర్స్‌ డే’, ‘గొరిల్లా’ చిత్రాలకు పాటలు రాశారు. 
*  సంస్కృతంలో ఈయన రచించిన భక్తి గీతాలు ప్రాచుర్యం పొందాయి. కొన్ని ఆధ్యాత్మిక గీతాల్నీ రాశారు. 
* వాణిజ్య ప్రకటనల జంగిల్స్‌ని రచించారు. 

views: 675

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams