Current Affairs Telugu Daily

భారత్‌కి రానున్న 2వేల ఏళ్ల కిందటి కళాఖండం
* ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడుకు చెందిన రెండు పురాతన కళాఖండాలను అమెరికా-బ్రిటన్‌కు చెందిన పరిశోధకుల బృందం తిరిగిచ్చింది.
* 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లండన్‌లోని ఇండియా హౌజ్‌లో జరిగిన కార్యక్రమంలో వీటిని భారత అధికారులకు అప్పగించారు. 
* అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 2000 ఏళ్ల కిందటి సున్నపురాతితో చేసిన శిల్పం కాగా మరొకటి తమిళనాడుకు చెందిన 300 ఏళ్ల కిందటి నవనీత కృష్ణ కాంస్య విగ్రహం ఉందని బ్రిటన్‌లోని భారత హై కమిషనర్‌ రుచి ఘనశ్యామ్‌ తెలిపారు.
* ఈ రెండు కళాఖండాలను అంతర్జాతీయ పురాతన వస్తువుల స్మగ్లర్‌గా పేరున్న సుభాష్‌ కపూర్‌ దొంగిలించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
*  ఇటీవల న్యూయార్క్‌లో పట్టుబడ్డ అతడు ప్రస్తుతం అక్కడి హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్‌(హెచ్‌ఎస్‌ఐ) అదుపులో ఉన్నాడు.

views: 717

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams