Current Affairs Telugu Daily

ఇస్రో అధిపతి శివన్‌కు అబ్దుల్‌ కలాం పురస్కారం
* భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అధిపతి, రాకెట్‌ మేన్‌గా పేరొందిన డాక్టర్‌ కైలాసవాడివో శివన్‌కు తమిళనాడు ప్రభుత్వం ‘అబ్దుల్‌ కలాం పురస్కారా’న్ని ప్రకటించింది.
*  శాస్త్ర-సాంకేతిక రంగాల్లో పురోగతి, విద్యార్థులకు అంతరిక్ష పరిజ్ఞానంపై అవగాహన కల్పించడంలో ఆయన చూపిన చొరవను గుర్తించి దీనికి ఎంపిక చేసింది. 
* పురస్కారం కింద ఎనిమిది గ్రాముల బంగారు కానుక, రూ.5 లక్షల నగదు పురస్కారం అందజేయనున్నారు. 
* శివన్‌ సారథ్యంలో ఇస్రో గత నెలలో చంద్రయాన్‌-2 ఉపగ్రహాన్ని రోదసిలోకి విజయవంతంగా పంపింది.
*  ఆయన తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాకి చెందినవారు. 
* 1983లో ఇస్రోలో శాస్త్రవేత్తగా చేరి, వివిధ హోదాల్లో పనిచేశారు. 
* జీఎస్‌ఎల్‌వీ క్రయోదశలో కీలక భూమిక పోషించారు. 
* ఇస్రోలో ఉపగ్రహాన్ని, రాకెట్‌ను ప్రయోగించడానికి ముందు అది పనిచేసే తీరుని పరీక్షించి, పర్యవేక్షించడానికి ఉపయోగపడే సాఫ్ట్‌వేర్‌కు శివన్‌ రూపకల్పన చేశారు. * అంగారకుడిపైకి పంపిన ‘మామ్‌’ ప్రాజెక్టుకు నేతృత్వం వహించారు. 
* ఆయన నేతృత్వంలో మూడేళ్లలో తిరుగులేని క్రయోజనిక్‌ ఇంజిన్‌ను తయారుచేశారు.

views: 696

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams