Current Affairs Telugu Daily

ఏపీ పరిపాలన ట్రైబ్యునల్‌ రద్దు
ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, పదోన్నతులు, సర్వీసు నిబంధనలకు సంబంధించిన వివాదాల పరిష్కారానికి దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన ట్రైబ్యునల్‌ (ఏపీఏటీ)కి కాలం చెల్లనుంది.
*ఏపీఏటీని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం తమకు పరిపాలన ట్రైబ్యునల్‌ అవసరం లేదని మూడేళ్ల క్రితమే స్పష్టంచేసింది. ఏపీఏటీ ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమైంది.
*రాష్ట్రం విడిపోయి ఐదేళ్లవుతున్నా హైదరాబాద్‌ కేంద్రంగానే అది పనిచేస్తోంది. నిర్వహణక ఖర్చు, జీతభత్యాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భరిస్తోంది.
*విభజన తర్వాత 13 జిల్లాలతో కూడిన చిన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ మారడంతో ఏపీఏటీకి పెద్దగా ప్రాధాన్యం లేదన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది.  

views: 1121

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams