Current Affairs Telugu Daily

ఉత్తర ధ్రువంపై నుంచి ఎయిరిండియా తొలి విమానం 
భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న ఎయిరిండియా ఉత్తర ధ్రువంపై నుంచి తొలి విమానాన్ని నడపనుంది.
*దిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వరకు విమానం ప్రయాణించనుంది. ఉత్తర ధ్రువంపై నుంచి విమానం నడిపే తొలి భారత విమానయాన సంస్థగా ఎయిరిండియా ఘనత సాధించనుంది.
*దీనివల్ల ప్రయాణ సమయం తగ్గి ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుందని ఎయిరిండియా తెలిపింది. ఇంధన వ్యయం కూడా తగ్గుతుందని వెల్లడించింది.
*ప్రస్తుతం దిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు విమానాలు బంగ్లాదేశ్‌, మయన్మార్‌, చైనా, జపాన్‌, పసిఫిక్‌ మహాసముద్రం దాటి అమెరికాలోకి ప్రవేశిస్తున్నాయి.
*కొత్త మార్గంలో 90 నిమిషాల మేర ప్రయాణ దూరం తగ్గనుంది. ఈ మార్గంలో కిర్గిజిస్థాన్‌, కజకిస్థాన్‌, రష్యా, అర్కిటిక్‌ సముద్రం, కెనడా ద్వారా విమానం అమెరికాలోకి ప్రవేశిస్తుంది.
Air India::
  • CEO: Pradeep Singh Kharola 
  • Headquarters: New Delhi

views: 816

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams