Current Affairs Telugu Daily

బల్గేరియా బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో ఇమాద్‌ ఫారూఖి కు స్వర్ణo
*  బల్గేరియా జూనియర్‌ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ క్రీడాకారిణి సామియా ఇమాద్‌ ఫారూఖి స్వర్ణ పతకం సాధించింది. 
*  బల్గేరియాలో జరిగిన బాలికల సింగిల్స్‌ ఫైనల్లో సామియా 9–21, 21–12, 22–20తో రెండో సీడ్‌ అనస్తాసియా షపోవలోవా (రష్యా)పై గెలిచింది.
*  బాలుర డబుల్స్‌ విభాగంలో తెలంగాణ ఆటగాడు విష్ణువర్ధన్‌ గౌడ్‌–ఇషాన్‌ భట్నాగర్‌ (భారత్‌) జంటకు రజతం లభించింది.
*  ఫైనల్లో విష్ణువర్ధన్‌–ఇషాన్‌ జోడీ 19–21, 18–21తో విలియమ్‌ జోన్స్‌–బ్రెండన్‌ జి హావో (బ్రిటన్‌) జంట చేతిలో ఓడిపోయింది.
*  మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఎడ్విన్‌ జాయ్‌–శ్రుతి మిశ్రా (భారత్‌); బాలికల డబుల్స్‌లో తనీషా–అదితి భట్‌ (భారత్‌) జోడీలకు స్వర్ణ పతకాలు లభించాయి.   

views: 745

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams