Current Affairs Telugu Daily

ఆసియాలో అతిపెద్ద పరిశోధన కేంద్రం ‘సర్వీస్‌ నౌ’ హైదరాబాద్‌లో ప్రారంభం
సర్వీస్‌ నౌ డిజిటల్‌ వర్క్‌ ఫ్లో సంస్థ ఆసియాలోనే తన అతి పెద్ద, ప్రపంచంలో రెండో విస్తృత పరిశోధన, అభివృధ్ధి కేంద్రాన్ని ప్రారంభించింది.
*రాయదుర్గంలోని నాలెడ్జ్‌ సిటీ ఐటీ కేంద్రం(భవనం)లో ఈ కేంద్రాన్ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
*సంస్థ చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌ సీజే దేశాయి, భారత నిర్వహణ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ రావు సూరపనేని, ఏపీజే టాలెంట్‌ ఆర్గనైజేషన్‌ సీనియర్‌ డైరెక్టర్‌ రాధా శ్రీనివాస్‌లు.
*అమెరికా తర్వాత నగరంలో రెండో అతిపెద్ద పరిశోధన, అభివృధ్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం నాలెడ్జ్‌ సిటీలో రెండు అంతస్తుల్లో 80 వేల చదరపు అడుగుల్లో కార్యాలయం ప్రారంభించామని, వచ్చే ఏడాది నాటికి మరో 80 వేల చదరపు అడుగులకు విస్తరిస్తామని, 1200 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉందని చెప్పారు.
*కృత్రిమ మేధ(ఏఐ), మొబైల్‌ రంగ పరిశోధనలే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తుందని వివరించారు. ‘టాస్క్‌’తో కలిసి 12 కళాశాలల్లో నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను 21 కళాశాలలకు విస్తరిస్తున్నట్లు చెప్పారు.
  • ServiceNow:
  • CEO: John Donahoe
  • Headquarters:Santa Clara, California

views: 752

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams