Current Affairs Telugu Daily

పటాన్‌చెరు వద్ద అయాన్‌ ఎక్స్ఛేంజీ పరిశోధనా కేంద్రం
 నీటి శుద్ధి సాంకేతిక పరిజ్ఞానంలో, వ్యర్థాల నియంత్రణలో క్రియాశీలకంగా ఉన్న సంస్థ అయిన అయాన్‌ ఎక్స్ఛేంజీ హైదరాబాద్‌ శివార్లలోని పటాన్‌చెరులో నూతన పరిశోధన-అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించింది.
*దాదాపు 24 వేల చదరపు అడుగుల నిర్మాణ స్థలంలో దీన్ని ఏర్పాటు చేసింది. దీనిపై రూ.30 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు సంస్థ ఛైర్మన్‌ అండ్‌ ఎండీ రాజేష్‌ శర్మ  తెలిపారు.
*రసాయనాలు, రెజిన్స్‌, మెంబ్రేన్స్‌, పాలీమర్స్‌, స్పెషాలిటీ కెమికల్స్‌ విభాగాల్లో పరిశోధనలపై ఈ కేంద్రం దృష్టి కేంద్రీకరిస్తుందని వివరించారు.
*నీరు, వ్యర్థ జలాల శుద్ధి, ప్రక్రియ విభజన-శుద్ధీకరణ, ప్రత్యేక ప్రక్రియ అనువర్తనం, ఉత్పేరకాల అభివృద్ధి వంటి కార్యకలాపాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
*ప్రత్యేకంగా ఎంజైమ్‌ పరిశోధన, జౌళి, ఆహార-పానీయాల పరిశ్రమకు అనువైన సేవలను ఆవిష్కరించటంపై పని చేయనున్నట్లు తెలిపారు.
*ఈ పరిశోధనా కేంద్రానికి కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (డీఎస్‌ఐఆర్‌) గుర్తింపు ఉన్నట్లు వివరించారు. ఈ నూతన పరిశోధనా కేంద్రంతో దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ విపణిలోనూ క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం కలుగుతుందని రాజేష్‌ శర్మ విశ్లేషించారు.

views: 650

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams