Current Affairs Telugu Daily

APలో కియా తొలి కారు సెల్టోస్ ఆవిష్కరణ
* దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ తాజాగా భారత్‌లో తమ తొలి కారు ’సెల్టోస్’ను ఆవిష్కరించింది.
* అనంతపురంలోని కియా ప్లాంటులో ఆగస్టు 8న జరిగిన కార్యక్రమంలో ఏపీఐఐసీ చైర్మన్ రోజా, భారత్‌లో దక్షిణ కొరియా రాయబారి షిన్ బాంగ్-కిల్, కియా మోటార్స్ ఇండియా ఎండీ కూక్ హున్ షిమ్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సెల్టోస్ కారును ఆవిష్కరించారు.
* అనంతపురం జిల్లా పెనుగొండలో సుమారు 536 ఎకరాల్లో కియా ప్లాంటు ఏర్పాటైంది. 
* ఈ నెల 22 నుంచి మార్కెట్‌లో కియా కార్లను విక్రయించనున్నట్టు కియా మోటార్స్‌ ఎండీ కుంషిమ్‌ వెల్లడించారు. 
* దేశవ్యాప్తంగా 206 షోరూమ్‌లలో ఈ కార్లఅమ్మకాలు జరుపుతామని చెప్పారు. 
* వెబ్‌సైట్‌ తెరిచిన రోజునే 6వేల కార్లు ముందస్తు బుకింగ్‌ అయ్యాయన్నారు. నేటి వరకు 23వేల మంది కార్ల కోసం ముందస్తుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు.
* వార్షికంగా దీని ఉత్పత్తి సామర్థ్యం 3 లక్షల కార్లు కాగా, భవిష్యత్‌లో 7 లక్షల యూనిట్లకు కియా పెంచుకోనుంది.
* 2019 ఏడాది జనవరిలో కియా మోటార్స్ ట్రయల్ ఉత్పత్తి ప్రారంభించింది. 
* రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక టెక్నాలజీలను ఈ ప్లాంటులో వినియోగిస్తోంది.
* సెల్టోస్ కారును ఇక్కణ్నుంచే దక్షిణాఫ్రికాతో పాటు ఇతర ప్రపంచ దేశాలకు కియా మోటార్స్ ఎగుమతి చేయనుంది.
* భారత్‌లో కియా మోటార్స్ దాదాపు 2 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేసింది.
* ఇందులో 1.1 బిలియన్ డాలర్లు అనంతపురం ప్లాంటుపైనే ఇన్వెస్ట్ చేసింది. 
* దీనితో 11,000 మందికి ఉపాధి లభిస్తుందని కియా తెలిపింది.

views: 781

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams