Current Affairs Telugu Daily

భారత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్న భారత వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ
* గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదా కలిగిన భారత వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ఈ స్వాతంత్ర్య దినోత్సవం నాడు లద్దాక్‌లోని లేహ్‌లో భారత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.
* ప్రస్తుతం పుల్వామా జిల్లా క్రూ ప్రాంతంలో పారా రెజిమెంట్‌ యూనిట్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ధోనీ.
* జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణను మోదీ సర్కార్‌ ఇటీవలే రద్దు చేసి.. జమ్ముకశ్మీర్‌, లద్దాక్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోనీ అక్కడ జాతీయ జెండాను ఎగరవేయనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
* ‘భారత ఆర్మీకి ధోనీ బ్రాండ్‌ అంబాసిడర్‌.
* సైనిక బలగాలతో కలిసి ఆర్మీ విధుల్లో ఆగస్టు 15 వరకు ధోనీ కొనసాగుతాడు.
* స్వాతంత్య్ర దినోత్సవం నాడు జమ్ముకశ్మీర్‌లోని ప్రతి గ్రామంలో భారత త్రివర్ణ పతాకం ఎగురవేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ధోనీ లెహ్‌లో జెండాను ఆవిష్కరించనున్నాడు.
* రెండు నెలల పాటు క్రికెట్‌ నుంచి విశ్రాంతి తీసుకున్న ధోనీ గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో పారాచూట్‌ రెజిమెంట్‌లో తన విధులు నిర్వర్తిస్తున్నాడు.

views: 776

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams