Current Affairs Telugu Daily

12 ఏళ్ల బుల్లోడు...రోబో చేశాడు
* మహమ్మద్‌ హస్సాన్‌ అలీ అతి చిన్న వయసులోనే రోబో తయారు చేసి అబ్బుర పరుస్తున్నాడు.
* మహమ్మద్‌ హస్సాన్‌ అలీ ప్రస్తుతం ఆస్మాన్‌ఘర్‌లోని ఇంటగ్రల్‌ ఫౌండేషన్‌ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు.
* ఇప్పటికే బీటెక్‌, ఎంటెక్‌ విద్యార్థులకు ఇంజినీరింగ్‌ పాఠశాలు బోధిస్తూ హస్సాన్‌ అలీ మంచి గుర్తింపు సాధించాడు.
* ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, రోబోటిక్స్‌లో హస్సాన్‌ అలీ పట్టు సాధించాడు. ఇందులో భాగంగా  పనులు చేసిపెట్టే రోబోను రూపొందించాలని నిర్ణయించుకున్నాడు.
* రూ.40 వేలు వెచ్చించి రోబోకు అవసరమైన పరికరాలు కోఠిలోని గుజరాతీ గల్లీలో లభించే సామగ్రి కొనుగోలు చేశాడు.
* రిసీవర్‌, ట్రాన్స్‌మీటర్‌, ఆర్డ్యూనోయునో, వాయిస్‌ ప్లే బ్యాక్‌ మాడ్యూల్‌, స్పీకర్‌, అల్ట్రాసోనిక్‌ సెన్సర్‌, రెండు మోటార్లు, రెండు చక్రాలు వినియోగించాడు. 
* ఇంటర్నెట్‌లో చూసి నేర్చుకుంటూ 15 రోజుల్లో రూపొందించాడు.
* ఈ రోబోకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. సర్వింగ్‌ రోబో(పనులు చేసేందుకు) వీలుగా దీన్ని అలీ తయారు చేశాడు. ఇది ఆటోమేటిక్‌తోపాటు మొబైల్‌, వాయిస్‌ కంట్రోలర్‌, లైన్‌ ఫాలోయింగ్‌ విధానంలో పని చేస్తుంది. 
* లైన్‌ ఫాలోయింగ్‌ విధానం కారణంగా హోటళ్లలో ఒక టేబుల్‌ నుంచి మరొక టేబుల్‌కు వెళుతూ ఆహార పదార్థాలు సరఫరా చేసేందుకు ఎంతో ఉపయోగ పడుతుందని అలీ తెలిపాడు.
* ఐఐఐటీ భాగస్వామ్యంలో ఓ ప్రాజెక్టును రూపొందించే పనిలో అలీ నిమగ్నమయ్యాడు. ఎంబెడ్డెడ్‌ సిస్టమ్స్‌లో దాదాపు 100కుపైగా ప్రాజెక్టులు తయారు చేశాడు.

views: 716

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams