Current Affairs Telugu Daily

మచిలీపట్నం పోర్టు లిమిటెడ్‌ (ఎంపీపీఎల్‌)తో కుదుర్చుకున్న ఒప్పందం రద్దు 
* పోర్టు నిర్మాణానికి మచిలీపట్నం పోర్టు లిమిటెడ్‌ (ఎంపీపీఎల్‌)తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.
* భూ కేటాయింపుల్నీ కూడా రద్దు చేసింది. పోర్టు నిర్మాణానికి లీజు ప్రాతిపదికన ఇచ్చిన 412.57 ఎకరాల్ని వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
* ప్రస్తుతం బందరు పోర్టు ప్రధాన అభివృద్ధిదారు (లీడ్‌ ప్రమోటర్‌)గా నవయుగ ఇంజినీరింగ్‌ కంపెనీ వ్యవహరిస్తోంది.
* మచిలీపట్నం డీప్‌వాటర్‌ పోర్టు నిర్మాణానికి మేటాస్‌ ఇన్‌ఫ్రా (40%), ఎన్‌సీసీ లిమిటెడ్‌ (11%), ఎస్‌ఆర్‌ఈఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌ (38%), శరత్‌ ఛటర్జీ అండ్‌ కంపెనీ విశాఖపట్నం ప్రైవేట్‌ లిమిటెడ్‌ (11%) సంస్థలతో కూడిన కన్సార్షియమ్‌ను ప్రధాన అభివృద్ధిదారుగా 2008లో రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.
* వజ్ర సీ పోర్టు ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో కన్సార్షియం నెలకొల్పిన ప్రత్యేక వాహక సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం 2008 ఏప్రిల్‌ 21న రాయితీ ఒప్పందం కుదుర్చుకుంది.
* 2008 ఏప్రిల్‌ 21 నుంచి 12 నెలల్లోగా ఫైనాన్షియల్‌ క్లోజర్‌ (ప్రాజెక్టుకు అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ ఏర్పాట్లు) పూర్తి కావాలి. ఆ తర్వాత వజ్ర సీ పోర్టు ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరును మచిలీపట్నం సీ పోర్టు లిమిటెడ్‌గా మార్చారు.
*  ఆ తర్వాత ఎస్‌ఆర్‌ఈఐ, శరత్‌ ఛటర్జీ అండ్‌ కంపెనీలు కన్సార్షియం నుంచి బయటకు రావడంతో మేటాస్‌ ఇబ్బందుల్లో పడింది. ఆ దశలో ఎంపీపీఎల్‌ విజ్ఞప్తి మేరకు నవయుగ ఇంజినీరింగ్‌ కంపెనీని లీడ్‌ ప్రమోటర్‌గా గుర్తించేందుకు ప్రభుత్వం అంగీకరించింది.
* ఈ ఒప్పందంలో భాగంగా 412.57 ఎకరాల్ని ఎంపీపీఎల్‌కి వెంటనే అప్పగించారు. అయినా 2010 జూన్‌ 7న సవరించిన రాయితీ ఒప్పందానికి ఆమోదం తెలిపే నాటికి పోర్టు నిర్మాణం దిశగా ఒక్క అడుగూ ముందుకు వేయలేదు.
* ఒప్పందం ప్రకారం 2010 జూన్‌ 7 నుంచి 12 నెలల్లోగా ఫైనాన్షియల్‌ క్లోజర్‌ పూర్తి చేయాలి. 2014 ఆగస్టు వచ్చినా ఎంపీపీఎల్‌ దాన్ని నెరవేర్చలేదు. 
* ఈ నేపథ్యంలో ఇండియన్‌ కాంట్రాక్ట్‌ యాక్ట్‌, 1872 ప్రకారం ఎంపీపీఎల్‌తో ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో పాటు, స్థలాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. నష్టపరిహారం కూడా కోరనున్నామని జీవోలో వెల్లడించింది.

views: 709



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams