Current Affairs Telugu Daily

అబూబకర్‌ అల్‌ బాగ్దాది హతం : ఐఎస్‌ఐఎస్‌
ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా(ISIS) నాయకుడు అబూబకర్‌ అల్‌ బాగ్దాది ప్రాణాలతో లేరని ఉగ్రవాద సంస్థ 2017 జులై 11న ప్రకటించింది. దీంతో బాగ్దాదీ చనిపోయాడంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరదించినట్లయింది. త్వరలోనే ఆయన వారసుడిని ఎన్నుకుంటామని తెలిపింది. మోసుల్‌లోని తల్‌ అఫార్‌ పట్టణంలోని ఐఎస్‌ఐఎస్‌ తన సొంత మీడియా ద్వారా  ఈ ప్రకటన చేసింది. ఇస్లామిక్‌ స్టేట్‌ చెర నుంచి మోసుల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు ఇరాక్‌ ప్రధాని హైదర్‌ అల్‌-అబాదీ ప్రకటించిన మరునాడే ఐఎస్‌ఐఎస్‌ ఈ ప్రకటన చేసింది. దాదాపు  8 నెలుగా ఐఎస్‌ చేతుల్లో ఉన్న మోసుల్‌ను భీకర పోరు తర్వాత ఇరాక్‌ సేనలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి.
ISIS- Islamic State of Iraq and Syria

views: 906

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams