Current Affairs Telugu Daily

సుష్మాస్వ‌రాజ్ క‌న్నుమూత
 * భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌ (67) ఆగష్టు 6న  రాత్రి  కన్నుమూశారు. 
* గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు. సుష్మాస్వరాజ్‌కు భర్త, కుమార్తె ఉన్నారు.
*అనారోగ్య కారణాలతో 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు.  
* 1953 ఫిబ్రవరి 14న హర్యాణాలోని అంబాలలో జన్మించిన సుష్మా  1970వ దశకంలో ఏబీవీపీ ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు.
*  ఏడుసార్లు ఎంపీగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 1977లో 25 ఏళ్ల వయసులోనే హరియాణా కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 
*  గతంలో సుష్మాస్వరాజ్‌ సుప్రీంకోర్టు న్యాయవాదిగా కూడా పనిచేశారు. ఆమె భర్త కౌశల్‌  ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఉన్నారు.
*  మోదీ ప్రభుత్వంలో సుష్మాస్వరాజ్‌ 2014 నుంచి 2019 వరకు విదేశాంగ మంత్రిగా  ఉన్నారు. 
* దిల్లీ ఐదో ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2009 నుంచి 2014 వరకు 15వ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహించారు.
* 1998 అక్టోబర్‌ 13 నుంచి దిసెంబరు 3వరకు దిల్లీ సీఎంగా పనిచేశారు. గతంలో వాజ్‌పేయీ హయాంలో మంత్రిగా  పనిచేశారు

views: 712

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams