Current Affairs Telugu Daily

 బాలలపై లైంగిక వేధింపుల నిరోధ  బిల్లుకు పార్లమెంటు ఆమోదం
* లైంగికదాడుల కేసులను వేగంగా విచారించేందుకు నిర్భయనిధి ద్వారా దేశంలో 1,023 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ వెల్లడించారు. 
* పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధించడానికి వీలు కల్పిస్తూ తీసుకొచ్చిన పోక్సో చట్ట సవరణ బిల్లుపై లోక్‌సభ ఆమోదించింది.
* 18 ఏళ్లలోపు వారికి పరస్పర అంగీకార శృంగార అనుమతి లేదని, బాల్యవివాహాల్లో భార్యపై భర్త లైంగికదాడికి పాల్పడినా నేరమేనని మంత్రి చెప్పారు.
*  లైంగికదాడి చేసినవారు 16 ఏళ్లలోపువారైతే ఉరిశిక్ష విధించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. 
*  చిన్నారులపై లైంగికనేరాలు, వేధింపులకు పాల్పడేవారి విచారణకు ప్రత్యేకకోర్టులు ఏర్పాటు చేయాలని బిల్లును ఆమోదించేముందు షీ టీమ్‌ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు

views: 733

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams