* సుప్రీంకోర్టులో పెరిగిపోతున్న పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించేందుకు న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
* 2009లో జడ్జీల సంఖ్యను 26 నుంచి 31కి పెంచారు. అయినా కానీ కోర్టులో పెండింగ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది
* ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తి కాకుండా 30 మంది (మొత్తం 31 మంది) న్యాయమూర్తులు ఉన్నారు.
* ఇకపై న్యాయమూర్తుల సంఖ్యను 33కి పెంచాలన్న ప్రతిపాదనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది.
* దీంతో ప్రధాన న్యాయమూర్తితో కలిసి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 34కు పెరగనుంది.
* త్వరలో దీనిపై పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖల మంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు.
* ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న మొత్తం 31 పదవులన్నీ భర్తీ అయ్యాయి
* భారత సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానంగా పరిగణించబడుతుంది, భారతదేశ రాజ్యాంగంలోని అధ్యాయం అరవ భాగం, ఐదవ పరిధిలో ఇది ఏర్పాటు చేయబడింది.
* భారత దేశం రాజ్యాంగం ప్రకారం, ఒక సమాఖ్య కోర్టుగా, రాజ్యాంగ పరిరక్షణకర్తగా, అత్యున్నత ధర్మాసనంగా సుప్రీంకోర్టు విధులు నిర్వహిస్తోంది.
* భారత రాజ్యాంగంలోని 124 నుంచి 147 వరకు అధికరణలు భారత అత్యున్నత న్యాయస్థానం యొక్క కూర్పు, అధికార పరిధిని నిర్దేశించాయి.
* ప్రధానంగా, ఇది రాష్ట్రాలు, ప్రాంతాల్లోని హైకోర్టులు ఇచ్చిన తీర్పులను సవాలు చేసే అప్పీళ్లను స్వీకరించే ఒక పునర్విచారణ ధర్మాసనంగా పనిచేస్తుంది. అయితే తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన కేసుల్లో అధికార పిటిషన్లను లేదా తక్షణ పరిష్కారం అవసరమైన తీవ్రమైన వివాదాలకు సంబంధించిన కేసులను కూడా ఇది విచారణకు స్వీకరిస్తుంది.
* భారత అత్యున్నత న్యాయస్థానం 1950 జనవరి 28న స్థాపించబడింది.
views: 722